Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి డిజిటల్ రూపాయి సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది..మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకోండి..?

RBI తొలి రిటైల్ డిజిటల్ రూపాయిని ప్రారంభించింది. బెంగళూరుతో సహా దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో డిజిటల్ రూపాయి ప్రారంభించబడింది. కాబట్టి ఇప్పుడు డిజిటల్ రూపాయి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేసింది. మీకు కూడా డిజిటల్ రూపాయిపై ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నివృత్తి చేసుకోండి.

From today digital rupee is available to common man if you have any doubts check here
Author
First Published Dec 1, 2022, 11:24 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) భారతదేశపు మొట్టమొదటి రిటైల్ డిజిటల్ రూపాయిని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు భువనేశ్వర్‌లలో నేడు (డిసెంబర్ 1) ప్రారంభించింది. రానున్న రోజుల్లో అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లాలకు విస్తరించనున్నారు. నవంబర్ 1న, ఆర్‌బిఐ హోల్ సేల్ రంగంలో డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. రిటైల్ డిజిటల్ రూపాయి భారతదేశపు మొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) లేదా వర్చువల్ కరెన్సీ. దీన్ని రిటైల్ కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు.

 పేపర్ కరెన్సీ వలె, ఇది కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)చే జారీ చేయబడుతుంది. ఇప్పటికే ఇచ్చిన సమాచారం ప్రకారం ఎనిమిది బ్యాంకుల్లో ఈ-రూపాయి ప్రారంభించనున్నారు. దీని ఉపయోగం క్రమంగా విస్తరించబడుతుంది. డిజిటల్ కరెన్సీ లావాదేవీలను ప్రారంభించడానికి బ్యాంకులు డిజిటల్ వాలెట్లను కూడా సృష్టిస్తాయి. 

డిజిటల్ రూపాయిలు ఎలా ఉపయోగించాలి..
ప్రస్తుతం అందరూ డిజిటల్ రూపాయిని ఉపయోగించలేరు. ఎందుకంటే ఇది పైలట్ ప్రాజెక్ట్, కొన్ని నగరాలకే పరిమితం అవుతుంది. రానున్న రోజుల్లో దీన్ని విస్తరిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కస్టమర్లు మరియు వ్యాపారుల క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (CUG)లో మాత్రమే దీనిని ఉపయోగించవచ్చని RBI ఇప్పటికే తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులను చేర్చడానికి విస్తరించనున్నారు. 

డిజిటల్ రూపాయల కోసం యాప్ కావాలా?
డిజిటల్ రూపాయల వినియోగాన్ని అనుమతించే బ్యాంకులు డిజిటల్ వాలెట్లను అందిస్తాయి. వినియోగదారులు దీనిని ఉపయోగించి లావాదేవీలు చేయవచ్చు. కస్టమర్లు డిజిటల్ రూపాయి ద్వారా ఇతర వినియోగదారులకు చెల్లింపులను బదిలీ చేయవచ్చు. అంటే వ్యక్తి నుండి వ్యక్తికి బదిలీ. షాపింగ్ చేసేటప్పుడు చెల్లింపు కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. 

ఏ బ్యాంకులు డిజిటల్ రూపాయిలను జారీ చేస్తాయి?
ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొనేందుకు ఎనిమిది బ్యాంకులు ఎంపికయ్యాయి. మొదటి దశలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్‌లను ఎంపిక చేశారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ పథకంలో చేరనున్నాయి. 

డిజిటల్ రూపాయి క్రిప్టోకరెన్సీ ఒకటేనా ?
కాదు, డిజిటల్ రూపాయి CBDC లేదా డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. ఇది ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ లేదా Bitcoin, Ethereum మొదలైన క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉంటుంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ తరహాలో ఇది ట్రేడింగ్ జరగదు. దీని విలువ మారదు.

డిజిటల్ రూపాయి సురక్షితమేనా?
అవును, డిజిటల్ రూపాయి ఫిజికల్ డబ్బులా పని చేస్తుంది. అయితే వాలెట్ లో ఉన్న డబ్బుకు వడ్డీ లభించదు. అకౌంటులో ఉంటే మాత్రం బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios