పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి చేస్తూ పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 ఆఖరి గడువులోగా అనుసంధించాలి అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాన్‌ను ఆధార్‌తో మార్చి 31లోగా అనుసంధానం చేయకపోతే  వారి  పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) పనిచేయదని పన్ను శాఖ తెలిపింది.

ఆదాయపు పన్ను విభాగం సోషల్ మీడియా ట్వీట్ ద్వారా ఆఖరి గడువు ముగిసేలోగా మీ పాన్ ఆధార్‌తో మార్చి 31, 2020 లోపు లింక్ చేయడం తప్పనిసరి అని ట్వీట్ చేసింది.మీరు బయోమెట్రిక్ ఆధార్ స్టాండర్డ్ ద్వారా, ఎన్ఎస్డిఎల్, యుటిఐటిఎస్ఎల్ పాన్ సేవా కేంద్రాలను సంప్రదించడం ద్వారా   పాన్-ఆధర్ లింక్ చేయవచ్చు.

also read ఎస్‌బి‌ఐ చైర్మన్ ను అవమానించిన నిర్మలా సీతారామన్ !

ట్వీట్‌తో పాటు ఒక వీడియోలో పాన్-ఆధార్‌ను అనుసంధానించడం రేపు చాలా ప్రయోజకరమైనది అని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. పాన్-ఆధార్ లింకింగ్ చేయడం కోసం ఆదాయపు పన్ను విభాగం షేర్ చేసిన వీడియోలో గడువుకు ముందే వాటిని లింక్ చేయడానికి రెండు సులభమైన మార్గాలను తెలిపింది
 
1. స్మార్ట్ ఫోన్ ద్వారా UIDPAN12digit Aadhaar> 10digitPAN> అని మీరు ఈ ఫార్మాట్‌లో టైప్ చేసి 567678 లేదా 56161 కు SMS పంపవచ్చు

2.  మీరు ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్ : www.incometaxindiaefiling.gov.in ద్వారా పాన్-ఆధార్‌ను లింక్ చేయవచ్చు

ఐ-టి విభాగా పాలసీని రూపొందించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి)  పాన్-ఆధార్ లింకింగ్ గడువు పొడిగింపు డిసెంబర్ 30, 2019నాటికి ఎనిమిదోసారి.

also read యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... రేపు సాయంత్రం 6గంటలకు...

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 AA (2) ప్రకారం, ప్రతి వ్యక్తి జూలై 1, 2017 నాటికి పాన్ కలిగి ఉండాలి అలాగే ఆధార్ పొందిన  తరువాత తన ఆధార్ సంఖ్యను పన్ను అధికారులకు తెలియజేయాలి. ఆధార్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) జారీ చేస్తుంది.  

పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోతే ?

సిబిడిటి ప్రకారం, మార్చి 31 లోగా ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ కార్డ్ పనిచేయదు. మార్చి 31 తర్వాత పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించైనా వారికి మాత్రమే పాన్ పనిచేస్తుంది.