ఫిబ్రవరి 27న గువహతిలో జరిగిన ఎస్‌బి‌ఐ ఫైనాన్షియల్ ఇంక్లూజన్  ఔట్ రీచ్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎస్‌బి‌ఐ చైర్మన్ రజనీష్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒసి) ఖండించింది.

ఒక్క మాటలో చెప్పాలంటే రజనీష్‌ కుమార్‌ను నిర్మలా సీతారామన్‌ ఘోరంగా అవమానించినట్లు ఒక ఆడియో క్లిప్‌ ద్వారా తెలుస్తోంది.

also read యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... రేపు సాయంత్రం 6గంటలకు...

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను "జాలి లేని బ్యాంక్" అని అన్నారు. అస్సాంలోని టీ గార్డెన్ కార్మికులకు రుణాలు ఇవ్వడంలో దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన ఎస్‌బి‌ఐ విఫలమైందని ఆరోపించారు.

పాన్-ఇండియా బ్యాంక్ అధికారుల సంఘం ఎస్‌బి‌ఐ చీఫ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఫైనాన్షియల్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ఎన్క్లేవ్ రికార్డింగ్ విషయంలో సోషల్ మీడియాలో ఫుటేజీని దుర్వినియోగం చేశారనే విషయంలో తక్షణ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

also read  స్టాక్‌ మార్కెట్లలో సేమ్ సీన్‌ రిపీట్..25 లక్షల కోట్లు ఆవిరి.. వాల్ స్ట్రీట్ నిలిపివేత

జరిగిన ఎపిసోడ్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని చూస్తే నిరాశగా ఉందని, ఎస్‌బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆర్ధిక మంత్రి స్పీచ్ ఆడియో క్లిప్‌ను గుర్తుతెలియని వారెవరో  రికార్డ్ చేసి వైరల్‌ చేశారని దీనిపై తక్షణం విచారణ జరపాలని ఏ‌ఐ‌బి‌ఓ‌సి  పేర్కొంది.