చాలా పనులు కూడా ఇంట్లో కూర్చునే చేయవచ్చు. ఇంటి నుండి ఫుడ్ ఆర్డర్, షాపింగ్ మొదలైనవి సులభంగా చేయవచ్చు. అదేవిధంగా, మీ బ్యాంకు పనిని కూడా ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవచ్చు.
నేటి కాలంలో మనం టెక్నాలజీలో చాలా ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కటి మన మొబైల్ ద్వార అందుబాటులో ఉన్నాయి. చాలా పనులు కూడా ఇంట్లో కూర్చునే చేయవచ్చు. ఇంటి నుండి ఫుడ్ ఆర్డర్, షాపింగ్ మొదలైనవి సులభంగా చేయవచ్చు. అదేవిధంగా, మీ బ్యాంకు పనిని కూడా ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవచ్చు. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, డెబిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా.. అన్ని పనులు ఇంట్లో కూర్చునే చేసేయవచ్చు. కానీ మనం టెక్నాలజి పరంగా ఎంత అభివృద్ధి చెందామో, మోసగాళ్లు కూడా చాలా చురుకుగా మారారు. వీరు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో కొత్త కొత్త మార్గాలను కనుగొంటున్నారు. మనము కొన్ని తప్పుల కారణంగా ఒక నిమిషంలో భారిగా నష్టపోవచ్చు. అందుకే ఈ పొరపాట్లను నివారించే మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం...
హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయవద్దు
మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి మెసేజెస్ లేదా ఇమెయిల్‌ల ద్వారా హానికరమైన లింక్‌లను పంపుతుంటారు. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, మీ డివైజ్(మొబైల్ లేదా కంప్యూటర్) కంట్రోల్ మీ చేతుల్లోంచి మోసగాడి చేతుల్లోకి వెళుతుంది తరువాత మీ బ్యాంక్ ఖాతాను మోసగాళ్ళు ఖాళీ చేస్తారు.
స్కీంస్ అండ్ లాటరీల పట్ల జాగ్రత్త
ప్రజలను మోసం చేయడానికి, మోసగాళ్ళు వారికి రకరకాల స్కీంస్, లాటరీల వంటి ఆఫర్లను చేస్తుంటారు. ప్రజలు వాటి ఉచ్చులో పడి వ్యక్తిగత రహస్య సమాచారాన్ని వారితో పంచుకుంటుంటారు. అయితే ఈ స్కీంస్, లాటరీల కోసం మీకు డబ్బులు రాకపోయినా మోసపోయామని గుర్తుంచుకోవాలి.
ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి
మిమ్మల్ని మోసం చేయడానికి చాలా మంది బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ మీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు. ఈ మోసగాళ్లు ఏటిఎం కార్డ్ గడువు ముగియడం లేదా కేవైసి పూర్తి చేయాలని అనే సాకుతో మీకు కాల్స్ చేస్తారు. మీరు ఇలాంటి సమాచారం ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
వాట్సప్ లో జాగ్రత్తగా ఉండండి
ఈరోజుల్లో వాట్సాప్ ద్వారా కూడా మోసగాళ్లు ప్రజలను వేధిస్తున్నారు. మీకు వాట్సప్ లో ఏదైనా లింక్ లేదా టెంప్టింగ్ ఆఫర్‌లు ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇలాంటి వాటిని పంపే వారిని వెంటనే బ్లాక్ చేయండి లేదా రిపోర్ట్ చేయండి.
