Asianet News TeluguAsianet News Telugu

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల జోరు పెరిగింది. మదుపర్లలో సెంటిమెంట్ బల పడటంతో పెట్టుబడుల వరద పోటెత్తింది. ఈక్విటీల్లోకే రూ.97 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. గత ఆరేళ్లలో ఇదే గరిష్ఠం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

FPIs open fund floodgates for Indian markets
Author
Hyderabad, First Published Dec 26, 2019, 12:40 PM IST

ముంబై/ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడుల జోరు కొనసాగుతున్నది. దేశంలో ప్రతికూల పరిస్థితులు, జీడీపీ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినా, పలు పాలసీలకు మోక్షం లభించకపోయినా దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ పోర్ట్ పోలియో మదుపర్లు రూ. లక్ష కోట్లకు పైగా నిధులను కుమ్మరించారు. 

విదేశీ పోర్ట్ పోలియో మదుపర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. వీటిలో ఒక ఈక్విటీ మార్కెట్లోనే రూ.97,250 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. గత ఆరేళ్లలో ఒక ఏడాది భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో డెబిట్ మార్కెట్లోకి రూ.27 వేల కోట్ల నిధులను తరలించిన ఎఫ్ వేల కోట్ల నిధులను హైబ్రిడ్ ఇన్ రూపంలో చొప్పించారని డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలిసింది. వచ్చే ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగేదానిపై విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. 

also read బ్లూ చిప్‌తోనే లాభాలు... బట్ వెనుకబడ్డ మిడ్ స్మాల్ క్యాప్

అమెరికా-చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టడం, దేశీయ మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉంటే తప్పా పోర్ట్ పోలియో మదుపర్లు వెనకడుగు వేసే అవకాశాలు లేవని స్పష్టంచేశారు. మరోవైపు అంతర్జాతీయంగా వడ్డీరేట్లు తగ్గుముఖం పడుతుండటం, సెంట్రల్ బ్యాంక్ విరివిగా నిధులను చొప్పిస్తుండటం, కార్పొరేట్ల ఆశాజనక ఆర్థిక ఫలితాలు కూడా ఎఫ్ జోష్ బజాజ్ క్యాపిటల్ హెడ్ అలోక్ అగర్వాల్ తెలిపారు. 

FPIs open fund floodgates for Indian markets

అమెరికా-చైనా ట్రేడ్ వార్, క్రూడాయిల్ భగ్గుమంటుండటం, దేశీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సంక్షోభం వంటి అంశాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ పోర్ట్ పోలియో పెట్టుబడులు కొనసాగడం విశేషమన్నారు. మరికొన్ని రోజుల్లో ముగియనున్న 2019లో విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడి దారులు ఇప్పటి వరకు ఎఫ్ 19 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. 

ఇప్పటి వరకు నికరంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన స్టాక్స్ విలువ అక్షరాల రూ.18 లక్షల కోట్లు, వీటిలో రూ.16.7 లక్షల కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. గత ఐదేళ్లలో రెండో అతిపెద్ద పెట్టుబడి ఇది. 2018లో రూ.81 వేల కోట్లను తరలించుకుపోయిన ఎఫ్పీఐలు ఆ మరుసటి ఏడాది భారీగా చొప్పించారు. 2017లో రూ.2 లక్షల కోట్లు, రూ.2006లో రూ.23 వేల కోట్లను ఉపసంహరించుకున్నారు.

also read మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో కొత్త రికార్డు...అదనంగా 4 లక్షల కోట్లు...

విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో ఈక్విటీల్లోకి రూ.97,250 కోట్ల పెట్టుబడులు పెట్టడం గడిచిన ఆరేళ్లలో ఇదే గరిష్ఠం. 2018లో రూ.33 వేల కోట్లు చొప్పించారు.  2017లో రూ.51 వేల కోట్లు, 2016లో రూ.20,500 కోట్లు, 2015లో రూ.17,800 కోట్లు, 2014లో రూ.97,054 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. 

2013లో రూ.1.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్పీఐలు రూ.1.28 లక్షల కోట్లు పెట్టారు. అమెరికా వడ్డీరేట్లను తగ్గించడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్యంపై సానుకూల వార్తలు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎఫ్పీఐల పెట్టుబడుల జోష్ పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios