కోవిడ్ -19తో పోరాడుతూ భారత మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) గవర్నర్ ఎం. నరసింహం మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 94.హైదరాబాద్‌లోని  ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

రిజర్వ్ బ్యాంక్ కేడర్ నుండి నియమించబడిన మొదటి, ఏకైక గవర్నర్ నరసింహం. అతను 13వ ఆర్‌బిఐ గవర్నర్‌గా 1977 మే నుండి నవంబర్ 30 వరకు అంటే ఏడు నెలలు పనిచేశాడు.

నరసింహం ఆర్‌బిఐ బ్యాంకులో ఆర్థిక శాఖలో రీసెర్చ్‌ అధికారిగా చేరారు. తరువాత ప్రభుత్వంలో చేరి ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.

also read అవును, తయారీరంగం నిజంగానే చైనాను విడిచిపెడుతున్నాయి.. అధికారులు వాటిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.....

ఆర్‌బిఐలో పనిచేసిన తరువాత  నరసింహం అంతర్జాతీయ ద్రవ్య నిధిలో చేరాడు, అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆ తరువాత ప్రపంచ బ్యాంకులో పనిచేశాడు. 1982లో ఆర్థిక కార్యదర్శిగా కూడా పనిచేశారు.

అధిక ధరాఘాతం, కరువు, అడుగంటిన విదేశీ మారక నిల్వలతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న భారత్‌ను గడ్డు పరిస్థితుల నుంచి గటెక్కించడంలో ఐఎంఎఫ్‌ ప్యాకేజీ ఎంతగానో తోడ్పడిందని ఆర్‌బీఐ చరిత్ర వాల్యూమ్‌-3 పేర్కొంది.

అంతేకాదు, ఆర్థిక సేవల రంగానికి సంబంధించి 1991లో ఏర్పాటైన కమిటీతోపాటు 1998లో బ్యాంకింగ్‌ రంగ సంస్కరణల కమిటీకీ నేతృత్వం వహించారు. ఆర్థిక రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా  2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.