నెట్టింట్లో వీడియో వైరల్.. బాధితురాలికి రూ. 292 కోట్ల పరిహారం..
నెట్టింట్లో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో అలాంటి వీడియోలు వైరల్ కావడం కామనేలే అనుకుంటున్నారు కాదా.. అంత ఈజీగా తీసివేయండి బాస్.. ఈ వీడియో ద్వారా ఓ బాధిత కుటుంబం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 35 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ. 292 కోట్లు) నష్ట పరిహారాన్ని అందుకుంది. ఆ వీడియో స్టోరీ ఏంటో ఓ లూక్కేద్దాం..
అమెరికాలోని జేపీ మోర్గాన్ కంపెనీ తన మాజీ ఉద్యోగినికి దాదాపు 8 ఏండ్ల తరువాత $ 35 మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 292 కోట్లు) పరిహారాన్ని అందించింది. అసలు ఇంత భారీ మొత్తంలో ఎందుకు పరిహారం చెల్లించింది? ఇంత కాలం ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం. వివరాల్లోకెళ్తే.. అది 2015.. మేఘన్ బ్రౌన్ అనే మహిళ వ్యక్తిగత కారణాల రీత్యా ఫిజికల్ థెరపీ కలిసి.. పక్క రూమ్ కు వెళ్తుంది. అక్కడ ఉన్న డోర్ ఓపెన్ చేయబోయారు. ఇంతలో ఆ గ్లాస్ డోర్ ఆకస్మాత్తుగా ఆమె తలపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె మెదడు శ్వాశతంగా దెబ్బతింది.
న్యూయార్క్‌లో సంఘటన జరిగిన ఒక సంవత్సరం తర్వాత.. బ్రౌన్ JP మోర్గాన్‌కి తిరిగి వచ్చారు. కానీ ఆమె పనితీరు ఒకేలా లేదు.దీంతో ఆమెను 2021లో తొలగించారు. ఈ క్రమంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో బ్రౌన్‌కు PTSD ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఆమె పనితీరు మందగించిందని, జ్ఞాపకశక్తి, దృష్టి , పదజాలం అన్నీ ప్రభావితమయ్యాయని తన బంధువులు కోర్టుకు తెలిపారు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు ఈ వీడియోను చూపించారు. ఈ ఫుటేజీలో 7.5 అడుగుల పొడవైన లాబీ తలుపు దాదాపు పగిలిపోతున్నట్లు చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రౌన్ తనపై గ్లాస్ తలుపు పడిన క్షణం గుర్తుందనీ, నేలపై పడినట్టు తాను గుర్తించానని తెలిపారు.ఆ సమయంలో అక్కడున్న కొంత మంది తనకి సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు . ఈ సంఘటనలో బ్రౌన్ మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ప్రతి విషయానికి ఆమె పక్కవారిపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో JP మోర్గాన్‌లో ఉన్నత స్థాయి విశ్లేషకురాలిగా తన ఉద్యోగాన్ని కోల్పోయాయని, రోజువారీ పనులను చేయలేకపోయిందని, తన జీవితం కూడా నాశనం చేసిందని ఆమె న్యాయస్థానానికి చెప్పింది. తాను వాసనను, రుచిని కూడా కోల్పోయననీ, తనకు ఒకప్పుడు స్పానిష్ భాషపై చాలా పట్టు ఉండేదనీ, కానీపూర్తిగా మర్చిపోయానని తన బాధను వెల్లడించారు. ఈ తరుణంలో ఆమెకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అమెరికాలోని జేపీ మోర్గాన్ కంపెనీ తన మాజీ ఉద్యోగినికి దాదాపు 8 ఏండ్ల తరువాత $ 35 మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 292 కోట్లు) పరిహారాన్ని అందించింది.