కుపెర్టినో ఆధారిత ఐఫోన్ తయారీదారు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ రికార్డులు బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తొలిసారిగా బిలియనీర్ జాబితాలో చేరాడు. ఆపిల్ ఇప్పుడు ప్రపంచంలోనే 1.84 ట్రిలియన్లతో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. దీంతో ఆయ‌న అధికారికంగా బిలియ‌నీర్(సుమారు 7500 కోట్లు)‌గా మారారు. 

బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్ల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ (187 బిలియన్ డాలర్లు), మాజీ మైక్రోసాఫ్ట్ సిఇఒ బిల్ గేట్స్ (121 బిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ (102 బిలియ‌న్ డాల‌ర్లు) వంటి ఇతర సిఇఓలతో కుక్ ఉన్నారు. యాపిల్‌లో టిమ్ కుక్ కు 847,969 షేర్ ఉన్నాయి.

also read రైల్వే శాఖ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు రైళ్లు బంద్.. ...

అతని పే ప్యాకేజీలో గత సంవత్సరం 125 మిలియన్ డాలర్లకు పైగా ప్యాకేజీగా తీసుకున్నారు" అని ఒక వార్తా పత్రిక నివేదించింది. 2 ట్రిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా రికార్డు సృష్టించేందుకు ఆపిల్ చేరువలో ఉంది.

గత వారం, ఆపిల్ సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ సౌదీ అరాంకోను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. పెరుగుతున్న సేవలు, వ్యాపారంలో ఆపిల్  2-ట్రిలియన్ మార్క్‌ను దాటి మొట్టమొదటి సంస్థగా అవతరించడానికి దగ్గరలో ఉంది.

2018లో 1-ట్రిలియన్ మార్కును దాటిన మొదటి యు.ఎస్ కంపెనీ ఆపిల్.