ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే సమ్మర్ సేల్స్ అంటూ మే 4-7 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సమ్మర్ కార్నివాల్ పేరుతో మే 4 నుంచి 7 వరకు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది.

సమ్మర్ కార్నివాల్‌లో భాగంగా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తోపాటు ఎక్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ వేరియంట్, నోకియా 6.1ప్లస్, నోకియా 5.1ప్లస్, రియల్‌మీ  2 ప్రో, హానర్ 9లైట్, హానర్ 10 వంటి స్మార్ట్ ఫోన్లతోపాటు జేబీఎల్ సినిమా ఎస్బీ 150, సోనీ ప్లే స్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్ ఎస్, గూగుల్ హోం అండ్ హోం మినీ వంటి వాటిపై భారీ రాయితీలు అందిస్తోంది. 

రియల్ మీ 2 ప్రో: రూ.10,990

రూ. 13,990 ధరతో మార్కెట్లోకి ప్రవేశించిన రియల్ మీ 2 ప్రో కార్నివాల్ సందర్భంగా రూ. 10,990కే లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్ కలిగిన ఈ ఫోన్ ఈ ధరతో లభిస్తుండటం చెప్పుకోదగ్గ విషయమే. 

ఐఫోన్ ఎక్స్ఆర్: రూ. 59,900

ఐఫోన్ ఎక్స్ఆర్ ధర(రూ. 59,900)లో ఎలాంటి మార్పు లేనప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే 10శాతం ఇన్ స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోందీ. దీంతో ఈ ఫోన్ రూ. 53,910కే లభిస్తోంది.

నోకియా 6.1ప్లస్: రూ. 12,999

నోకియా 6.1ప్లస్ రూ. 12,999కే లభిస్తోంది. ఈ ఫోన్ వాస్తవ ధరపై రూ. 3,000 తగ్గింపును ఇస్తుండటం గమనార్హం. స్టాక్ ఆండ్రాయిడ్ పై ఓఎస్, స్నాప్ డ్రాగన్ 636చిప్‌‌సెట్ కలిగిన ఈ మొబైల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.