ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలు వరుస ఆఫర్లతో వినియోగదారులను ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ ప్రేమికులకు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్‌ ఫెస్ట్‌ సేల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ బొనాంజా సేల్‌ -2019ను  సోమవారం  ప్రకటించింది.  ఈ నెల 28వ తేదీ వరకు వరుసగా నాలుగురోజులపాటు ఈ సేల్‌ ఉంటుంది. 

వినియోగదారులకు ‘నో కాస్ట్‌’, ‘ఈఎంఐ’, ‘క్యాష్‌బ్యాక్’ ఆఫర్లను అందిస్తోంది.  దీంతోపాటు  యాక్సిస్‌ బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 5 శాతం అదనపు డిస్కౌంట్‌ను కూడా ఇవ్వనుంది.

ముఖ్యంగా షియోవోమి రెడ్‌మి నో 6 ప్రొ, రెడ్‌మి 6 , పోకో ఎఫ్‌ 1 లను తక్కువ ధరకే అందిస్తోంది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్‌  గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఏ 50, గెలాక్సీ ఏ 10, తోపాటు హానర్‌ 9 లైట్‌, హానర్‌ 9ఎన్‌, హానర్‌ 10  లైట్‌   స్మార్ట్‌ ఫోన్లు  ఫ్లిప్‌కార్ట్‌ తాజా మొబైల్‌ మొనాంజా సేల్‌ 2019లో లిస్టయి వుండటం విశేషం.

ఇలా అమెజాన్ ‘ఫ్యాబ్ ఫోన్స్ పెస్ట్ 
మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ప్రకటించింది. వందల యాక్సెసరీల ధరలను తగ్గించింది. వీటిలో హెడ్‌ఫోన్స్, పవర్ బ్యాంక్స్, ప్రొటెక్టివ్ కేస్‌లు తదతర వస్తువులు ఉన్నాయి.

సోమవారం ప్రారంభమైన ఈ ఫెస్ట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. రియల్‌మీ యూ1, హువావే వై9 (2019), వివో వై83 ప్రొ వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. 

రియల్‌మీ యూ1 (3జీబీ ర్యామ్) ధరను రూ.2 వేలు తగ్గించిన అమెజాన్ రూ.9,999కే విక్రయానికి పెట్టింది. హువావే వై9 (2019)పై రూ.1000 తగ్గించడంతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్, రూ.13,050 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
 
వివో వై83 ప్రొ లాంచింగ్ ధర రూ.15,990 కాగా, ఇప్పుడు దాన్ని 11,990కి తగ్గించింది. వివో స్మార్ట్‌ఫోన్లపై రూ.1000 అమెజాన్ పే బ్యాలెన్స్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది.
 
వీటితోపాటు ఆనర్ ప్లే, ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ, ఒప్పో ఎఫ్9 ప్రొ, వన్‌ప్లస్ 6టీ, షియోమీ ఎంఐ ఎ2, ఒప్పో ఎఫ్11 ప్రొ, వివో వీ15 ప్రొ వంటి ఫోన్లతోపాటు హెడ్‌ఫోన్లు, కార్ చార్జర్లు, పవర్ బ్యాంకులు, ప్రొటెక్టివ్ కేసులు తదితర వాటిపైనా అమెజాన్ భారీ రాయితీలు ఇస్తోంది.