Asianet News TeluguAsianet News Telugu

Flipkart బిగ్ బిలియన్ డేస్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే డిటర్జెంట్ సోప్ వచ్చింది..షాకింగ్ సంఘటన..

ఫెస్టివల్ సీజన్ లో ఈ కామర్స్ సైట్స్ అనేక భారీ ఆఫర్లతో సేల్స్ చేస్తుంటాయి. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు కస్టమర్‌లను ఆకర్షించడానికి ఫెస్టివల్ సమయంలో భారీ డిస్కౌంట్స్ అందిస్తాయి. దీని ద్వారా కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయడానికి ఆకర్షితులవుతారు. అయితే, కొన్నిసార్లు, ఆన్‌లైన్ విక్రయాల్లో పొరపాట్లు, మోసాలు జరుగుతుంటాయి. తద్వారా కస్టమర్లు వింత అనుభవాలను ఎదుర్కొంటారు.

Flipkart Big Billion Days Laptop Order Received Detergent Soap
Author
First Published Sep 29, 2022, 2:43 PM IST

గతంలో మనం ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఐఫోన్  ఐఫోన్ బదులు డిటర్జెంట్ సోప్ వచ్చిన కథనాలు చాలా చదివే ఉంటాం. అలాగే డెలివరీ బాయ్స్ చేసే మోసాలను కూడా చూసే ఉంటాం. ఈ కామర్స్ కంపెనీలు  డెలివరీ  బాయ్స్  చేసే తప్పిదాలతో చాలాసార్లు అపఖ్యాతి పాలవుతుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ప్రస్తుతం చోటు చేసుకుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సందర్భంగా  కస్టమర్ తన తండ్రి కోసం ల్యాప్టాప్ బుక్ చేస్తే, దానికి బదులుగా  ప్యాకేజీలో డిటర్జెంట్ సబ్బులు వచ్చాయి.  దీంతో సదరు కస్టమర్ లబోదిబో అంటున్నాడు.  అయితే గతంలో ఈ కామర్స్ సంస్థలు ఇలాంటి తప్పిదాలను గుర్తించి  నష్టపోకుండా రిఫండ్ చేసేవి కానీ నీ కేసులో మాత్రం రిఫండ్ చేసేందుకు ఈ కామర్స్ కంపెనీ ససేమిరా అంటోంది.

పూర్తివివరాల్లోకి వెళితే, ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయగా అమ్మకం చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తన తండ్రికి ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్ యశస్వి శర్మకు ఫ్లిప్‌కార్ట్ నుంచి లాప్ టాప్ బదులుగా ఘడి డిటర్జెంట్ సబ్బులు వచ్చాయని ఆరోపించాడు. ఈ లాప్ టాప్ ను తాను బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాడు. ఫ్లిప్‌కార్ట్ తన తప్పును అంగీకరించడానికి నిరాకరించిందని కూడా యశస్వి ఆరోపించాడు.   

యశస్వి శర్మ, లింక్డ్‌ఇన్, ట్విట్టర్ పోస్ట్ ప్రకారం, ల్యాప్‌టాప్‌కు బదులుగా తన ఘడీ డిటర్జెంట్ సబ్బులను పంపగా, తాను ఫిర్యాదు చేస్తే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ తననే నిందిస్తోందని వాపోయాడు. తన వద్ద సీసీటీవీ ఫుటేజీలున్నప్పటికీ అది వృథా అయిందని ఆరోపించాడు. అంతేకాదు వచ్చిన డెలివరీ ప్యాకేజీకి అంగీకరించడం తన తండ్రి తప్పిదమని కూడా పోస్ట్‌లో పేర్కొన్నాడు. తన తండ్రికి "ఓపెన్-బాక్స్" డెలివరీ గురించి తెలియదు. . ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ప్రకారం, డెలివరీ చేసే వ్యక్తి ముందు బాక్స్‌ను తెరిచి, ఉత్పత్తిని జాగ్రత్తగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొనుగోలుదారు OTPని అందించాలని వాపోయాడు. 

సంబంధిత లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో, యాశవ్ శర్మ ఇలా అన్నాడు: "డెలివరీ బాయ్ వచ్చి బాక్స్‌ను తనిఖీ చేయక ముందే వెళ్లిపోయాడని తన వద్ద CCTV ఆధారాలు ఉన్నాయని. అన్‌బాక్సింగ్ తర్వాత, ల్యాప్‌టాప్ లోపల లేదు." అయితే, ఓటీపీ వచ్చినందున రీఫండ్ చేయడం సాధ్యం కాదని చెప్పి డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సోషల్ మీడియాలో రాశారు.  "మా నాన్న పొరపాటు - ఫ్లిప్‌కార్ట్ నుండి వచ్చిన ప్యాకేజీలో డిటర్జెంట్ కాదు ల్యాప్‌టాప్ ఉంటుందని ఆయన అనుకున్నాడు. మరోవైపు, డెలివరీ బాయ్ OTP కోసం అడిగే ముందు ఓపెన్ బాక్స్ కాన్సెప్ట్ గురించి రిసీవర్‌కి ఎందుకు తెలపలేదు అని లింక్డ్‌ఇన్‌లో యశవ్ శర్మ రాశారు.

అలాగే, ఐఐఎం గ్రాడ్యుయేట్ యశశ్వి శర్మ మాట్లాడుతూ, ఫోరమ్‌కు వెళ్లే ముందు వినియోగదారులకు తెలియజేయడానికి చివరి ప్రయత్నంగా తన ఫిర్యాదును సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పారు. అతను తన పోస్ట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తిని ట్యాగ్ చేశాడు, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios