Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్...భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్‌

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు(మంగళ వారం) వెలువడనున్నాయి. ఇప్పటికే పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ప్రకటించాయి. దీంతో ఈ ప్రభావం దేశీయ స్టాక్  మార్కెట్ పడింది. ఈ సర్వే ఫలితాలకు తోడు రేపు జరగనున్న ఓట్ల కౌంటింగ్ కారణంగా ఇవాళ ఉదయం ప్రారంభమైనప్పటి నుండి మార్కెట్ నష్టాల్లోనే కొనసాగింది. 

five states Election Result impact on Stock Market
Author
Mumbai, First Published Dec 10, 2018, 2:59 PM IST

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు(మంగళ వారం) వెలువడనున్నాయి. ఇప్పటికే పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ప్రకటించాయి. దీంతో ఈ ప్రభావం దేశీయ స్టాక్  మార్కెట్ పడింది. ఈ సర్వే ఫలితాలకు తోడు రేపు జరగనున్న ఓట్ల కౌంటింగ్ కారణంగా ఇవాళ ఉదయం ప్రారంభమైనప్పటి నుండి మార్కెట్ నష్టాల్లోనే కొనసాగింది. 

బిఎస్ఈ సెన్సెక్స్ 660 పాయింట్లు కోల్పోయి 34000 పాయింట్ల దిగువన ట్రెండయ్యింది. అలాగే నిప్టి 180 పాయింట్లు పతనమై 10530కి దిగువకు చేరింది. అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ నష్టపోవాల్సి వచ్చిందని మదుపర్లు తెలిపారు. 

ఇవాళ్టి స్టాక్ మార్కెట్ నష్టాలకు కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాలే కాకుండా రూపాయి క్షీణత, ముడిచమురు ధరల పెరుగుదల కూడా కారణమయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్‌ బ్యాంక్‌, వేదాంత, యస్‌ బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌ సహా పలు షేర్లు భారీగా నష్టపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios