Asianet News TeluguAsianet News Telugu

Budget 2020: బడ్జెట్ ప్రసంగంలో నిర్మల కశ్మీరీ షాయరీలు

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది

Finance Minister Nirmala Sitharaman Reads Shayari While Tabling Budget 2020
Author
Hyderabad, First Published Feb 1, 2020, 11:48 AM IST

కేంద్ర బడ్జెట్ 2020ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. ఆమె స్వయంగా బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. సామాన్యులు, రైతులే లక్ష్యంగా తాము ఈ బడ్జెట్ ప్రవేపెట్టినట్లు చెప్పిన ఆమె.. పలు విషయాలను వివరించారు.

ఈ బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఆమె కశ్మీరీ షాయరీలు వినిపించారు. ఆమె చెప్పిన కవిత ఇదే..

‘‘నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం లాంటిది
మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం
నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం
మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ తోటలాంటిది’’ అంటూ ఆమె చెప్పిన కవిత అందరినీ ఆకట్టుకుంది. 

 కాగా ఆదాయాలను పెంచేలా, కొనుగోలు శక్తి పెంచేలా ఈ బడ్జెట్ ని తయారు చేసినట్లు చెప్పారు.యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయన్నారు. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రాల ఆదాయం పెరిగిందన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. ఒకే పన్ను, ఒకే దేశ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read Budget 2020: బడ్జెట్ ప్రసంగం.. అరుణ్ జైట్లీకి నిర్మలమ్మ నివాళి...

దేశ ప్రజలకు సేవ చేయాలనే దీక్షతో బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జాతి నిర్మాణంలో యువత, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని పేర్కొన్నారు. కాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది

Follow Us:
Download App:
  • android
  • ios