Asianet News TeluguAsianet News Telugu

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేశారా? స్టేటస్ ఇలా ఈజీగా చెక్ చేయవచ్చు..

ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయడం ద్వారా ఒక వ్యక్తి ITR రీఫండ్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిసిప్ట్  నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ITR రిటర్న్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Filed Income Tax Return? Check the status and when the refund will be received-sak
Author
First Published Jun 25, 2024, 9:29 AM IST | Last Updated Jun 25, 2024, 9:29 AM IST

ఇప్పుడు ఛారిటబుల్ టాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి టైం వచ్చేసింది . ఫారమ్ 16 తీసుకున్న తర్వాత జీతాలు తీసుకుంటున్న వారు కూడా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌లో రీఫండ్ క్లెయిమ్ చేసిన తర్వాత ఒక వ్యక్తి ITR రీఫండ్ స్టేటస్ చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయడం ద్వారా ఒక వ్యక్తి ITR రీఫండ్ స్టేటస్  ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిసిప్ట్ నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ITR రిటర్న్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి... 

ITR రీఫండ్ స్టేటస్ తెలుసుకోవవడం ఎలా.. 

1] మొదట ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లింక్‌కి లాగిన్ కావాలి – https://eportal.incometax.gov.in/iec/foservices/#/login;

2] యూజర్ ID అండ్  పాస్‌వర్డ్‌ని ఎంటర్  చేయండి

3] 'మై అకౌంట్'కి వెళ్లి, 'రిటర్న్/డిమాండ్ స్టేటస్'పై క్లిక్ చేయండి

4] డ్రాప్ డౌన్ మెనుకి వెళ్లి, 'ఆదాయ పన్ను రిటర్న్స్' సెలెక్ట్ చేసుకొని, 'సబ్మిట్'  అప్షన్ పై క్లిక్ చేయండి

5] ఇప్పుడు మీకు ఇచ్చిన నంబర్‌పై క్లిక్ చేయండి

6] ఇది రీఫండ్ ఇష్యూ తేదీతో సహా మీ అన్ని ITR వివరాలను చూపే కొత్త వెబ్‌పేజీని తెరుస్తుంది

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు వారి పాన్ కార్డ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో ITR రీఫండ్ స్టేటస్  కూడా చెక్ చేయవచ్చు. ఇందుకోసం ఎన్‌ఎస్‌టీఎల్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios