రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించిన వారం తర్వాత హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్లను సవరించింది. దీంతో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలో ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ చేరింది.

మీరు ఫిక్సెడ్ డిపాజిట్ (FD)ని తెరవాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు మంచి అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అండ్  హెచ్‌డి‌ఎఫ్‌సి (HDFC) బ్యాంక్ రెండూ ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అంటే ఇప్పుడు వినియోగదారులకు మరింత ప్రయోజనం లభిస్తుంది. గతంలో ఎస్‌బి‌ఐ వడ్డీ రేట్లను పెంచగా, ఇప్పుడు అదే బాటలో హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కూడా పెంచింది. 

హెచ్‌డి‌ఎఫ్‌సి  కొత్త వడ్డీ రేట్లు
కొత్త రేట్ల గురించి పూర్తి సమాచారం హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందించింది. దీని ప్రకారం బ్యాంకు రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి  వచ్చాయి. బ్యాంక్ 1-సంవత్సరం ఎఫ్‌డి వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు 4.9 శాతం నుండి 5 శాతానికి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు 5 బేసిస్ పాయింట్లు 5.40 శాతం నుండి 5.45 శాతానికి పెంచింది. అంతకుముందు జనవరిలో హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల మధ్య కాల వ్యవధికి 5.2 శాతానికి, 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాలకు 5.4 శాతానికి, 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలకు 5.6 శాతానికి తగ్గించింది.

ఎస్‌బి‌ఐ చేసిన  మార్పు 
ఎస్‌బి‌ఐ ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను రెండు నుండి మూడు సంవత్సరాల కాలానికి 5.20 శాతానికి పెంచింది, అయితే గతంలో ఎఫ్‌డిల వడ్డీ రేట్లను మార్చింది. 2 నుంచి 5 ఏళ్ల ఎఫ్‌డీ డిపాజిట్లపై రేట్లు 5.45 శాతానికి పెంచారు. అదే సమయంలో 5 నుండి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డి డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.50 శాతానికి సవరించబడ్డాయి. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఇంతకుముందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూ‌సి‌ఓ బ్యాంక్ కూడా ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను పెంచాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కొత్త వడ్డీ రేట్లను పరిశీలిస్తే 7 నుండి 14 రోజుల ఎఫ్‌డిపై 2.75 శాతం, 15 నుండి 45 రోజులకి 2.90 శాతం, 46 నుండి 90 రోజులలో 3.25 శాతం, 91 నుండి 179 రోజులలో 3.80 శాతం, 180 నుండి 364 రోజులు 4.25 శాతం, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు 5 శాతం, 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే లోపు 5.10 శాతం, అయితే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై కొత్త వడ్డీ రేటు 5.15 శాతం చేయబడింది. 

యూకో బ్యాంక్ వడ్డీ రేట్లు 
అదేవిధంగా యూ‌సి‌ఓ బ్యాంక్ కూడా వివిధ  ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ మార్పు తర్వాత 7 నుండి 29 రోజుల ఎఫ్‌డిలపై కొత్త వడ్డీ రేటు 2.55 శాతం, 30 నుండి 45 రోజులలో 2.80 శాతం, 46 నుండి 90 రోజులలో 3.55 శాతం, 91 నుండి 180 రోజులలో 3.70 శాతం, 181 నుండి 364 రోజులలో 4.40 శాతం. ఒక సంవత్సరం వరకు ఉన్న ఎఫ్‌డిలపై  5.10 శాతం, 1 సంవత్సరం 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డిలపై 5.10 శాతం, 3 సంవత్సరాలు 1 రోజు నుండి 5 కంటే తక్కువ కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డిలపై 5.30 శాతం, 5 సంవత్సరాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.10 శాతంగా నిర్ణయించబడింది.