Asianet News TeluguAsianet News Telugu

వాహనదారుల కోసం గూగుల్ పే సరికొత్త ఫీచర్.. కార్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది..

 గతంలో ఫాస్ట్ ట్యాగ్ అమలు కోసం ప్రభుత్వం గడువును మూడు సార్లు పొడిగించిన సంగతి మీకు తెలిసిందే. దేశంలోని కొన్ని బ్యాంకులు ఫాస్ట్ ట్యాగ్ సదుపాయాన్ని అందిస్తుండగా, ప్రభుత్వం మినిమమ్ బ్యాలెన్స్‌పై కూడా మినహాయింపు ఇచ్చింది.

 

fastag news today how to recharge fastag using google pay here is smart step to  guide
Author
Hyderabad, First Published Feb 15, 2021, 5:14 PM IST

జనవరి 15 నుండి అంటే నేటి అర్ధరాత్రి  నుంచి దేశవ్యాప్తంగా టోల్ కలెక్షన్ కోసం ఫాస్ట్ ట్యాగ్ సిస్టంను అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం ఈసారి ఫాస్ట్ ట్యాగ్ గడువును పొడిగించబోదని కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

గతంలో ఫాస్ట్ ట్యాగ్ అమలు కోసం ప్రభుత్వం గడువును మూడు సార్లు పొడిగించిన సంగతి మీకు తెలిసిందే. దేశంలోని కొన్ని బ్యాంకులు ఫాస్ట్ ట్యాగ్ సదుపాయాన్ని అందిస్తుండగా, ప్రభుత్వం మినిమమ్ బ్యాలెన్స్‌పై కూడా మినహాయింపు ఇచ్చింది, దీంతో  ఫాస్ట్ ట్యాగ్  జీరో బ్యాలెన్స్‌పై కూడా పని చేయనుంది. మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఉపయోగిస్తున్నట్లయితే  మీరు ఫాస్ట్ ట్యాగ్ ను వెంటనే రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకొండి...

డబుల్ టోల్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది
ఫాస్ట్ ట్యాగ్ ఉండటం వల్ల టోల్ ప్లాజాలలో ట్రాఫిక్ అలాగే ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. దేశంలోని 90 శాతం టోల్‌ ప్లాజాలపై ఫాస్ట్ ట్యాగ్  తప్పనిసరి చేస్తూ నియమం విధించారు. కారుకి  ఫాస్ట్ ట్యాగ్  లేకపోతే డబుల్ టోల్ టాక్స్ విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

అలాగే  హైవే వెంట నగర రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాలపై కూడా ఈ నియమం వర్తిస్తుంది. ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ను 23కి పైగా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్‌పిసిఐ ద్వారా విక్రయిస్తున్నారు.

ఇవి కాకుండా పెట్రోల్ పంపులు, టోల్ ప్లాజాలు, ఆర్టీఓలు, అమెజాన్ మొదలైన వాటిలో  కూడా ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు. వాహనం  ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్ (ఆర్‌సి & డిఎల్) లేదా ఆధార్ కార్డు చూపించి ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు. అలాగే దీన్ని  సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

also read గృహ రుణం అంటే ఏమిటి? బ్యాంకులు రుణాలను ఎలా నిర్ణయిస్తాయి ? ప్రతిదీ తెలుసుకోండి.. ...

రీఛార్జ్ చేయడానికి..
గూగుల్ పే నుండి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయడానికి, మీరు గూగుల్ పే అక్కౌంట్ ఉపయోగించాలి, ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) తో అనుసంధానించబడుతుంది. గూగుల్ పే యాప్ ద్వారా  ఫాస్ట్ ట్యాగ్ అక్కౌంట్ రీఛార్జ్ చేయడమే కాకుండా, పేమెంట్ రికార్డులను కూడా చూసుకోవచ్చు.

మీ  ఫాస్ట్ ట్యాగ్ అక్కౌంట్ ఎలా లింక్ చేయాలంటే ?
ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్ తెరవండి
తరువాత న్యూ పేమెంట్ పై నొక్కండి
కింద సూచించిన ఆప్షన్స్ లోకి వెళ్లి మోర్‌పై క్లిక్ చేయండి, గూగుల్ పే యాప్ కనిపించకపోతే మళ్ళీ మోర్ ఆప్షన్ పై నొక్కండి.
అక్కడ ఫాస్ట్ ట్యాగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది.
 మీరు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేస్తే, మీకు 200 రూపాయల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ .100 క్యాష్‌బ్యాక్, రూ .100 అమెజాన్ గిఫ్ట్ వోచర్ అందిస్తుంది. 
దీని తరువాత  ఫాస్ట్ ట్యాగ్  జారీ చేసే బ్యాంకును ఎంచుకుని, మీ కారు నంబర్‌ను అందులో ఎంటర్ చేయండి.  
దీని తరువాత మీరు గూగుల్ యాప్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios