ఫ్యాన్స్ పై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని భారతీయ ఫ్యాన్స్ తయారీదారుల సంఘం ( ఐ‌ఎఫ్‌ఎం‌ఏ) ప్రభుత్వాన్ని కోరింది.

ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో అట్టడుగు స్థాయికి వినియోగం పెంచడం ద్వారా ఫ్యాన్స్ ను ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే వస్తువుగా మార్చాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని అసోసియేషన్ తెలిపింది.

పరిశ్రమ ఇప్పటికే ఆత్మనీభర్ భారత్ మిషన్ తో అనుసంధానించబడి ఉందని, దాదాపు 98 శాతం సీలింగ్ ఫ్యాన్స్ మేడ్ ఇన్ ఇండియా మాత్రమే అని తెలిపింది.

also read ఇండియాలోనే మొట్టమొదటిసారి.. విమానంలో ప్రయాణించే వారికి ఫ్రీ వై-ఫై..

వార్షిక అమ్మకాలలో 35 శాతం నష్టం సంభవించినందున కరోనా వైరస్ మహమ్మారి వల్ల పరిశ్రమకు సవాలుగా ఉందని ఇఫ్మాఐ‌ఎఫ్‌ఎం‌ఏ సూచించింది.

ప్రస్తుత జీఎస్టీ రేటు 18 శాతంగా ఉందని, పంపిణీదారుల నుండి వినియోగదారుల వరకు పరిశ్రమతో పాటు మొత్తం సప్లయ్ చెయిన్ పై ఇది  ప్రభావం చూపుతోందని ఐ‌ఎఫ్‌ఎం‌ఏ చైర్మన్ అతుల్ జైన్ తెలిపారు.

"జిఎస్టి రేటు తగ్గింపు వల్ల ఉత్పత్తి, గృహ వినియోగదారులకు మరింత సులభంగా అందుబాటులోకి తెస్తుంది" అని ఆయన చెప్పారు.