Asianet News TeluguAsianet News Telugu

స్టార్టప్‌లకు నిధుల కొరత.. ‘ఏంజిల్’ టాక్స్‌తో పొంచి ఉన్న సవాళ్లు:నాస్కామ్


స్టార్టప్‌ల్లో పెట్టుబడులు తగ్గుముఖం పడుతున్నాయని ఇది మంచి పరిణామం కాదని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏంజిల్ సంస్థలకు నిధుల చేయూత కల్పించడానికి బదులు ఐటీ దిగ్గజ సంస్థలు వాటి స్వాధీనానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్టప్ సంస్థలకు ‘ఏంజిల్’ టాక్స్ కట్టాలని నోటీసులు జారీ చేయడం వల్ల ఆయా సంస్థలపై ఒత్తిళ్లు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

Fall in angel investment is a concern, says expert
Author
Hyderabad, First Published Jan 5, 2019, 2:54 PM IST

హైదరాబాద్‌: ఏంజెల్‌ పెట్టుబడులు, సీడ్‌ ఫండింగ్‌ తగ్గుముఖం వంటి అంశాలు స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. పెట్టుబడులు, నిధుల లభ్యత తగ్గుతుండటం స్టార్టప్‌ రంగానికి హెచ్చరిక లాంటిదని ఆయన పేర్కొన్నారు. 2018 పెట్టుబడుల పరంగా స్టార్టప్‌ రంగానికి అద్భుతమైన ఏడాదని ఆయన తెలిపారు. కానీ చిన్న సంస్థలకు అవసరమైన నిధుల చేయూత ఇవ్వకుండా భారీ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కొనుగోళ్లు చేపట్టడం ఈ రంగానికి అంత మంచిది కాదన్నారు. 

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు చిన్న సంస్థలే కీలకమని, ఈ సంస్థలకు నిధులు లభించకపోవటం వంటి అంశాలు ఈ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది 1,200కు పైగా స్టార్టప్స్‌ కార్యకలాపాలు ప్రారంభించాయని, ఇందులో అత్యధికం టెక్‌ ఆధారిత కంపెనీలేనన్నారు.
 
2017తో పోల్చితే గత ఏడాది స్టార్టప్‌లు భారీగా పెరిగాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో స్టార్టప్‌ రంగంలో ఏంజెల్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌, సీడ్‌ ఫండింగ్‌ గణనీయంగా పెరిగాయని, ప్రారంభ స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల్లో పెట్టుబడులు తగ్గడం ఏ మాత్రం మంచిది కాదన్నారు. 

2017లో ఏంజెల్‌ పెట్టుబడులు, సీడ్‌ ఫండింగ్‌ దాదాపు 50 శాతానికి పైగా పడిపోయాయని, 2018లో ఇందులో ఏ మార్పు లేదని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. పన్ను అథారిటీలు ఇటీవల ‘ఏంజెల్‌ టాక్స్‌’ అని నోటీసులు పంపటం వంటి అంశాలు ఈ రంగంపై మరింత ఒత్తిడిని పెంచాయన్నారు. స్టార్టప్‌ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న అంశాలపై ఈ మధ్యే వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి వివరించామన్నారు.

దేశంలో స్టార్టప్‌ రంగం రోజురోజుకు వృద్ధిపథంలో సాగుతున్న తరుణంలో ప్రభుత్వపరంగా తోడ్పాటునందించాలని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ కోరారు. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నోటీసులపై ఇన్వెస్టర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించాలని మంత్రులను కోరినట్లు చంద్రశేఖర్‌ తెలిపారు.
 
ఏంజెల్‌ టాక్స్‌ విషయంలో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. ఏంజెల్‌ ఇన్వెస్టర్లు పెడుతున్న పెట్టుబడులపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 56 కింద పన్నులు విధించటాన్ని పలు స్టార్టప్‌ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఏంజెల్‌ టాక్స్‌ వల్ల పలు స్టార్టప్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నవిషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో దీనికి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios