Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్‌ కు ‌భారీ షాక్...16 వేల కోట్ల పెనాల్టీ

వినియోగదారుల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన వివరాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయయించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కష్టాలను కొనితెచ్చుకుంది.  ఈ డాటా లీకేజి అంశంపై  అమెరికాకు చెందిన వినియోదారుల వ్యవహారాల సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టిసి)ముమ్మర విచారణ చేపట్టింది. ఫేస్ బుక్ సంస్థ కూడా డాటా లీకేజీకి పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ఆ సంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ఎఫ్‌టిసి సిద్దమైంది. 

Facebook May Face Record FTC Fine for Privacy Violations
Author
USA, First Published Jan 19, 2019, 1:52 PM IST

వినియోగదారుల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన వివరాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయయించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కష్టాలను కొనితెచ్చుకుంది.  ఈ డాటా లీకేజి అంశంపై  అమెరికాకు చెందిన వినియోదారుల వ్యవహారాల సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టిసి)ముమ్మర విచారణ చేపట్టింది. ఫేస్ బుక్ సంస్థ కూడా డాటా లీకేజీకి పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ఆ సంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ఎఫ్‌టిసి సిద్దమైంది. 

గతంలో  2012లో ఇలాగే వినియోగదారులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసిన గూగుల్ సంస్థకు ఎఫ్‌టిసి రికార్డు స్థాయిలో 16వేల కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. తాజాగా ఫేస్ బుక్ కూడా అలాంటి గోప్యతా ఉళ్లంఘనలకే పాల్పడినందుకు ఇదే తరహాలో జరిమానా విధించేందుకు ఈ వినియోగదారుల సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు మించి జరిమానా విధించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని తాజాగా వెలువడిన నివేధికలు వెల్లడిస్తున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను కలిగివున్న సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ పై డాటా లీకేజికి సంబంధించి తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్ ఇతర సంస్థలతో పంచుకున్నట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో  నిజంగానే తప్పు జరిగినట్లు ఒప్పుకున్న ఫేస్ బుక్...విచారణ సందర్భంగా అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు కూడా ఒప్పుకుంది. ఫేస్ బుక్ సీఈవో జుకన్ బర్గ్ కూడా ఈ తప్పిందంపై బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు.  
  
ఇలా స్వతహాగా పేస్ బుక్ సంస్థే డాటా లీకేజీపై ఒప్పుకుంది కాబట్టి ఎఫ్‌టీసీ చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో భారీ జరిమానా విధించేందుకు సిద్దపడినట్లు న్యూయార్క్ టైమ్స్  వెల్లడించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios