న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ లండన్‌లోని తన కార్యాలయాన్ని శుక్రవారం మూసేసింది. ఫిబ్రవరిలో  సింగపూర్ లోని ఉద్యోగికి  కరోనావైరస్ ఉన్నట్లు లక్షణాలను గుర్తించిన  తరువాత  ఈ నిర్ణయం తీసుకుంది.

మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకు ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది. డీప్ క్లీన్ కోసం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి తన కార్యాలయాలను మూసివేసినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.

also read మహిళల కోసం స్కిల్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టిన గూగుల్

మార్చి 9, సోమవారం వరకు ఫేస్‌బుక్‌ తన లండన్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపింది. ఫేస్‌బుక్‌ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

సింగపూర్‌లో తమ కంపెనీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు లండన్‌లోని తమ కార్యాలయాన్ని సందర్శించారని, ఆ తర్వాత ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

also read యెస్ బ్యాంకు వ్యవస్థపకుడి ఇంట్లో ఈడీ తనిఖీలు... లావాదేవీల్లో అవకతవకలు...కేసు నమోదు

ఉద్యోగుల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నట్లయితే వారు వెంటనే ఆస్పత్రి సందర్శించి వైద్య చికిత్స చేయించుకోవాలని, ఆ తర్వాత కోలుకున్నాకే తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

డబల్యూ‌హెచ్‌ఓ  తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 98వేల కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, మరణాల సంఖ్య కూడా 3వేలు దాటిందని తెలిపింది. ఒక్క యు.కే లోనే 163 కేసులు ధృవీకరించగ తాజాగా రెండు మరణాలు జరిగాయి అని తెలిపింది.