ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) బోర్డు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం వడ్డీ రేటులో 8.5 శాతం మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈపీఎఫ్ ఖాతాల్లోని నిధిపై ప్రస్తుతం 8.15 శాతం వడ్డీని, మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఇపిఎఫ్ ఖాతాలకు జమ అవుతుందని ఇపిఎఫ్ సంస్థ తెలిపింది.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి 0.35 శాతం బకాయి వడ్డీని డిసెంబర్‌లో చెల్లించాలని బోర్డు సమావేశంలో నిర్ణయించింది. కార్మిక, ఉపాధి మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన ఇపిఎఫ్ఓ ​​ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (సి‌బి‌టి) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

"కోవిడ్ -19 అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా, వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను సెంట్రల్ బోర్డు సమీక్షించింది.  కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇడిఎల్ఐ) పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ.6 లక్షల నుండి రూ .7 లక్షలకు పెంచింది.

దీంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతానికి ఖాతాదారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌వై 20) తమ డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీని పొందుతారు. మిగిలిన 0.35 శాతం ఈ ఏడాది డిసెంబర్‌లో జమ అవుతుందని సిబిటి సభ్యుడు తెలిపారు.

also read రిలయన్స్ రిటైల్ లో 15% వాటాకు రూ.63,000 కోట్లు..

8.5 శాతం వడ్డీ రేటు ఇప్పటికే ఏడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో చందాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు లభించింది. వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి), ఇపిఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ డిసెంబరులో మరోసారి సమావేశమై మిగిలిన 0.35 శాతం వడ్డీని ఇపిఎఫ్ ఖాతాలో జమచేయాలని తెలిపింది.

కోవిడ్-19 సంబంధిత ఆంక్షలు ఉన్నప్పటికీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఏప్రిల్-ఆగస్టు కాలంలో మొత్తం రూ.35,445 కోట్ల రూపాయల 94.41 లక్షల క్లెయిమ్‌లను చెల్లించింది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ క్లెయిమ్‌లను చెల్లించింది. కరోనా సంక్షోభ కాలంలో క్లెయిమ్‌ల సంఖ్యం మొత్తం 13 శాతం పెరిగింది.