Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు గుడ్ న్యూస్... క్యాష్ విత్ డ్రాలకు ఓకే...

కరోనా కష్టాల నుంచి తన ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన ఖాతాదారులకు రిలీఫ్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఆర్థిక సమస్యలు ఎదురైతే పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం నగదు విత్ డ్రాయల్స్‌కు అనుమతినిచ్చింది. ఆ విధానం గురించి తెలుసుకుందాం..

EPFO special facility: How to withdraw EPF online
Author
Hyderabad, First Published Apr 5, 2020, 3:35 PM IST

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు ఫ్రావిడెండ్ ఫండ్ నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఖాతాదారులందరికీ మొబైల్ ఫోన్ ద్వారా ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నది. లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఇది నిజంగా ఊరట కలిగించే అంశమే.

దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్‌డ్రా అవకాశం ఉంటుంది. మీ ఖాతాలోని సొమ్ములో 75 శాతం లేదా మీ మూడు నెలల బేసిక్ సాలరీ, డీఏకు సమాన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుని నగదు ఉపసంహరణకు అనుమతిస్తారు.

ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో రూ.50వేల (ఉద్యోగి విరాళం, సంస్థ వాటా, వీటిపై వడ్డీ అంతా కలిపి) సొమ్ము ఉన్నది. మీ బేసిక్ సాలరీ, డీఏ నెలకు రూ.15వేలుగా ఉన్నది. అంటే మూడు నెలలకు రూ.45 వేలు అవుతున్నది. ఖాతా సొమ్ము రూ.50 వేలలో 75 శాతం అంటే రూ. 37, 500. దీంతో మీరు పీఎఫ్ అడ్వాన్స్‌గా ఈ రూ. 37,500 ఉపసంహరించుకోవచ్చు.

కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈపీఎఫ్ వెసులు బాటు కలిగించింది. పీఎఫ్ ఖాతాలో నుంచి తీసుకున్న ఈ మొత్తం మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఏదైనా అవసరంతో నగదును ఉపసంహరించుకున్నా మళ్లీ ఈ కరోనా అడ్వాన్స్ తీసుకోవచ్చు.

ఈ అడ్వాన్స్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఈపీఎఫ్‌వోకు సమర్పించనవసరం లేదు. విత్‌డ్రా చేసుకున్న సొమ్ము ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఆన్‌లైన్‌లో విత్‌డ్రా విధానం ఏమిటంటే https:// unifiedpo rtalmem. epfindia. gov.in/ mem berinter faceలోకి లాగిన్ కావాలి.

తదుపరి ఆన్‌లైన్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత క్లెయిమ్ (మీకు అవసరమైన ఫాం-31, 19, 10సీ, 10డీ)ను క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ ఖాతా నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ప్రవేశపెట్టాలి. దాన్ని ధ్రువపరుచుకోవాలి.

ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌పై క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ నుంచి పీఎఫ్ అడ్వాన్స్ (ఫాం 31)ను ఎంచుకోవాలి. డ్రాప్ డౌన్ నుంచి కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్న నగదు ఉపసంహరణ కారణం ఎంచుకోవాలి.

మీకు అవసరమైన మొత్తాన్ని నమోదు చేయాలి. స్కాన్ చేసిన చెక్ కాపీని అప్‌లోడ్ చేయాలి. మీ చిరునామానూ ఎంటర్ చేసి, గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ అనుసంధాన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక క్లెయిమ్‌ సమర్పిస్తే సరిపోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios