న్యూ ఢీల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఖాతాదారులకు చెదు వార్తా. పెట్టుబడులపై రాబడి తగ్గడం, నగదు ప్రవాహం కారణంగా  2020 ఆర్ధిక సంవత్సరాణికి ప్రకటించిన 8.5% వడ్డీ రేటును  8.1శాతానికి తగ్గించేదుకు సిద్దమవుతుంది.

ఆర్ధిక సంవత్సరం ఆదాయాల ఆధారంగా వడ్డీ రేటు ప్రకటిస్తారు అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఖాతాదారులకు చెల్లిస్తారు. అయితే అంతకు ముందు ప్రకటించిన వడ్డీని చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇపిఎఫ్‌ఓ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్‌ఐఐసి) త్వరలో సమావేశమవుతుందని కొన్ని వర్గాలు తెలిపాయి.

మార్చి మొదటి వారంలో ప్రకటించిన 8.5% వడ్డీ రేటును ఇంకా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాతే కార్మిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును తెలియజేస్తుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు, యజమానుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు, ఖాతాదారులు ఎక్కువ నిధులను విత్‌డ్రా చేయడం, ద్రవ్య లభ్యతపై ప్రభావం చూపిందని  భావిస్తున్నారు.  

also read కుప్పకూలిన ఐ‌ఆర్‌సిటిసి షేర్లు..ఆగస్ట్‌ 12 వరకూ రైళ్లు రద్దు... ...

ఈ వడ్డీ రేట్ల కోత  దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులను ప్రభావితం చేయనుంది. "గత సంవత్సరానికి ప్రకటించిన వడ్డీ రేటు ఆధారంగా డబ్బు పంపిణీ ఇపిఎఫ్ఓకు కష్టమవుతుంది, ఎందుకంటే నగదు ప్రవాహం గణనీయంగా తగ్గింది, పంపిణీ సమయంలో నిధుల లభ్యత సులభం కాదు" అని ఎఫ్‌ఐఐసి సమావేషం గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పారు.

కోవిడ్ -19 ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఉద్యోగులు, యజమానులపై పడకుండా సహాయార్ధం  కోసం ప్రభుత్వం మార్చి నుండి ప్రావిడెంట్ ఫండ్-సంబంధిత సహాయ చర్యలను ప్రకటించింది. ప్రావిడెంట్ ఫండ్ సహకారం ఉద్యోగులు, యజమానులకు మూడు నెలల పాటు ప్రాథమిక వేతనంలో 12% నుండి 10% కి తగ్గించింది.

ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు తమ వాటాను అందించడానికి కంపెనీలకు ఎక్కువ సమయం ఇచ్చింది. కరోనా కాలంలో ఏప్రిల్, మే నెలల్లో 11,540 కోట్ల రూపాయల మేర, 3.61 మిలియన్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు  2020 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించాలని ఎఫ్‌ఐఐసి సిఫారసు చేసింది. దీని వల్ల రిటైర్మెంట్ ఫండ్ బాడీతో రూ .700 కోట్లు మిగిల్చింది.