Asianet News TeluguAsianet News Telugu

Enhanced Meal Service: నేటి నుంచే ఎయిరిండియాలో టాటా మెరుగైన భోజ‌నం..!

బిడ్డింగ్ ప్రక్రియలో ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్, కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయం కల్పించడం ద్వారా, ఆ సంస్థలో తన కార్యాచరణను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.

Enhanced Meal Service
Author
Hyderabad, First Published Jan 27, 2022, 9:30 AM IST

బిడ్డింగ్ ప్రక్రియలో ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్, కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయం కల్పించడం ద్వారా, ఆ సంస్థలో తన కార్యాచరణను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.ముంబై నుంచి నాలుగు మార్గాల్లో గురువారం బయలుదేరే సర్వీసుల్లో ప్రత్యేక భోజన సేవలను టాటా ప్రవేశపెట్టనుంది. ఏఐ 864 (ముంబై -ఢిల్లీ), ఎఐ 687 (ముంబై-ఢిల్లీ), ఎఐ 945 (ముంబై -అబుదాబీ), ఏఐ639 (ముంబై- బెంగళూరు) మార్గాల్లో ఈ భోజన సేవలు మొదలుకానున్నాయి. 

అలాగే మెరుగైన భోజన సేవ కార్య‌క్ర‌మం శుక్రవారం ముంబై-నెవార్క్ విమానం, మ‌రో ఐదు ముంబై- ఢిల్లీ విమానాలలో కూడా అందించబడుతుందని అధికార వ‌ర్గాలు పేర్కొన్నారు. టాటా గ్రూప్ అధికారులు రూపొందించిన మెరుగైన భోజన సేవ అస్థిరమైన మరియు దశలవారీ పద్ధతిలో మరిన్ని విమానాలకు విస్తరించబడుతుందని అధికారులు తెలిపారు. టాటా గ్రూప్ పేరు కింద ఎయిరిండియా విమానాలు గురువారం నుంచే నడవబోవని అధికారులు తెలిపారు. అంతకుముందు ప్రభుత్వం గురువారం నాడే టాటా గ్రూప్ నకు ఎయిరిండియాను అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 


కానీ తదుపరి ఈ విషయమై స్పష్టత ఇవ్వలేదు. టాటా గ్రూప్ పేరు మీద ఎయిరిండియా విమానాలు నడిచే తేదీని త్వరలో ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. టాటా గ్రూప్ నుంచి ఎయిరిండియాను తీసుకున్న 69 ఏళ్ల తర్వాత ముళ్లీ ఆ సంస్థకే ప్రభుత్వం అప్పగించనుంది. ప్రభుత్వం నిర్వహించిన వేలం ప్రక్రియ ద్వారా ఎయిరిండియాను . టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ గతేడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

69 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిర్‌ ఇండియా టాటాల గూటికి గురువారం(జనవరి) నాడు చేరుతోంది. అధికారికంగా ఎయిర్‌ ఇండియాను నేడు టాటాలకు ప్రభుత్వం అప్పచెబుతోంది. ఎయిర్‌ ఇండియా పైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం బిడ్స్ పిలిచిన విషయం తెలిసిందే. అందరికంటే ఎక్కువగా రూ.18 వేల కోట్లకు టాటా గ్రూప్‌ బిడ్‌ వేసింది. టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌ 8న ఈ కంపెనీకే ఎయిర్‌ ఇండియా దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

ఎయిర్​ ఇండియాను టాటా గ్రూప్​నకు అమ్మేసినట్లు అక్టోబర్​8న ప్రకటించిన మూడు రోజుల తర్వాత ప్రభుత్వం లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ జారీ చేసింది. అక్టోబర్​ 25న టాటా గ్రూప్​తో షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ (ఎస్​పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని ఫార్మాలిటీస్​ పూర్తి కావడంతో గురువారం టాటా గ్రూప్​నకు ఎయిర్​ ఇండియాను అప్పచెప్పనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఎయిర్​ ఇండియాతోపాటు, ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​, ఎయిర్​ ఇండియా ఎస్​ఏటీఎస్​లు కూడా టాటాల చేతికి రానున్నాయి. నష్టాలలో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ఎయిర్​ ఇండియాలో నూరు శాతం వాటాను ప్రైవేటు రంగానికే ప్రభుత్వం ఇచ్చేస్తోంది. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్టియం అందించిన రూ. 15,100 కోట్ల ఆఫర్‌ను టాటాస్ అక్టోబర్ 8న బీట్ చేసింది. నష్టాల్లో ఉన్న క్యారియర్‌లో 100 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయించిన రూ. 12,906 కోట్ల రిజర్వ్ ధరను అధిగమించింది. 2003-04 తర్వాత కేంద్రం మొదటి ప్రైవేటీకరణ ఇదే. 

Follow Us:
Download App:
  • android
  • ios