ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వివాదానికి తెరలేపాడు.ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తన పో మర్చిపెంపుడు కుక్కతో పోల్చుతూ పోస్ట్ చేసి వివాదానికి తెరలేపాడు.

నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే టెస్లా అధిపతి, తాజా ట్విట్టర్ అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్, మరో వివాదాస్పద పోస్టు ట్వీట్ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను కుక్క కన్నా హీనం అని అర్థం వచ్చేలా ట్విట్టర్ సీఈవో కుర్చీ పై ఓ కుక్కను కూర్చోబెట్టి దాని మెడలో సీఈఓ అని తగిలించి ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాన మస్క్ ప్రపంచ కుబేరుడు అయి ఉండవచ్చు. కానీ అతనికి కనీస సంస్కారం లేదని నెటిజెన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్ ఒప్పందం సందర్భంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ తో, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ కు మధ్య అనేక వివాదాలు తలెత్తాయి.

ఒక దశలో పరాగ్ అగర్వాల్ మస్క్ ట్విట్టర్ డీల్ విజయవంతం కాకుండా ప్రయత్నాలు చేశాడని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అయితే మస్క్ కూడా తాను ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే, అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ ను అతని టీం మెంబెర్లను వెంటనే తొలగించాడు. అంతటితో ఆగలేదు మాటల యుద్ధాన్ని కొనసాగించుతూ మస్క్ పరాగ్ అగర్వాల్ పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మాస్క్ చేసినటువంటి సెటైర్ భారతీయుల మనోభావాలను సైతం దెబ్బతీసినట్లు ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Scroll to load tweet…

ఎలాన్ మస్క్ తాజా పోస్టులో ఎట్టకేలకు ట్విటర్‌కు నూతన సీఈఓను కనుగొన్నామని. ఇకపై Twitter కొత్త CEO మనిషి కాదు, తన పెంపుడు కుక్క, ఫ్లోకి, షిబా ఇను. అని ప్రకటించారు. అంతేకాదు "గత సీఈవో పరాగ్ అగర్వాల్ కంటే తన కుక్క Floki మెరుగైన CEOగా పని చేస్తుందని ఎలాన్ మస్క్ సెటైర్ వేశాడు. అయితే మస్క్ చేసిన ఈ ట్వీట్ నెట్టిజనులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

అమెరికాలో పలు మల్టీ నేషనల్ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, పెప్సీ, మాస్టర్ కార్డ్ వంటి అనేక సంస్థలకు భారతీయులే సీఈవోలతో పాటు పాలు సంస్థల్లో కీలక బాధ్యతలతో భారతీయులు ఉన్నారు. నిజానికి పరాగ్ అగర్వాల్ గత కొంతకాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ ఎలా మస్క్ మాత్రం అతడిని ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని పరాగ్ సన్నిహితులు వాపోతున్నారు.

ట్విట్టర్ పని తీరుపై శ్రద్ధ పెట్టాలని మాజీ సీఈఓపై కాదని మరికొందరు నెటిజెన్లు మండిపడుతున్నారు. పరాగ్ అగర్వాల్ నేతృత్వంలో ట్విట్టర్ అద్భుతమైన పనితీరు సాధించిందని, మెరుగైన వృద్ధిని కనపరిచిందని అతని అభిమానులు చెబుతున్నారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులు సైతం ఎలా మాస్క్ చర్యను ఖండిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలా మస్క్ ఇలాంటి రెచ్చగొట్టే వైఖరిని మానుకోవాలని చెబుతున్నారు.