టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మస్క్ సోషల్ మీడియాలో ఏప్పుడు ఆక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఈసారి కరోనా వైరస్ మహమ్మారిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపాయి.

మంగళవారం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సిఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ పై ఎలాన్ మాస్క్ చేసిన తప్పుడు సమాచారం పై మాట్లాడారు.

బిల్ గేట్స్, ఎలోన్ మస్క్ కరోనా వైరస్ మహమ్మారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు "అతను తనకు తెలియ‌ని విష‌యాల్లో అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చి ఇబ్బంది పాల‌వుతాడు.

అందుకే అత‌నికి తెలిసిన విష‌యాల‌కు ప‌రిమిత‌మై ఉంటే బాగుంటుంది" అని సూచించాడు. ఎలాన్ మస్క్ ఇంతకుముందు కరోనా వైరస్ మృతులను ఎక్కువ చేసి చూపిస్తున్నారు.

also read వాహనదారులకు గుడ్ న్యూస్: డీజిల్ పై లీటర్‌కు రూ.8.36 తగ్గింపు.. ...

లాక్ డౌన్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బిల్ గేట్స్ కి  కోపం తెప్పించాయి. ఎలాన్ మాస్క్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూ లో "అతను కరోనా వ్యాక్సిన్ విషయంలో తలదూర్చకుండ ఉండాల్సింది.

అతను గొప్ప ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయగలడు.  కానీ తెలియని విషయాల్లో అనవసరంగా మాట్లాడి ఇబ్బంది పడుతుంటాడు అని అన్నారు. ఎలోన్ మస్క్ ఈ మధ్యాహ్నం చేసిన ఈ ట్వీట్ కి నెటిజన్లు పరోక్షంగా స్పందిస్తూ ట్రోల్ చేశారు.

"బిల్ గేట్స్,  నేను ప్రేమికులం అనే పుకారు పూర్తిగా అవాస్తవం" అని ఎలాన్ మాస్క్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అతను చేసిన ట్వీట్ కి 99వేల 'లైక్‌లు', వేలాది మంది వినోదభరితమైన రిట్వీట్లు చేశారు.