న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఎరోల్ మస్క్ బ్రిటిష్ టాబ్లాయిడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సవతి కూతురు జానా బెజుడెన్‌హౌట్‌తో శారీరక సంబంధం ఉందని అంగీకరించాడు. అయితే 2019 సంవత్సరంలో జానా రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్ వంటి పాపులర్ కంపెనీల అధినేత ఎలోన్ మస్క్ తండ్రి షాకింగ్ న్యూస్ బహిర్గతం చేశారు. 76 ఏళ్ల ఎర్రోల్ మస్క్ తన 35 ఏళ్ల సవతి కూతురు జానా బెజుడెన్‌హౌట్‌తో లైంగిక సంబంధం, ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చిందని చెప్పాడు. మూడేళ్ళ క్రితం రెండవ బిడ్డకు జన్మనిచ్చిందని ఎలోన్ మస్క్ తండ్రి తెలిపాడు.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఎరోల్ మస్క్ బ్రిటిష్ టాబ్లాయిడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సవతి కూతురు జానాతో శారీరక సంబంధం ఉందని అంగీకరించాడు అలాగే 2019 సంవత్సరంలో ఆమె రెండవ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. జానాతో రెండవ బిడ్డ "ప్రణాళిక లేనిది" అయితే వారి 41 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం కారణంగా ఇద్దరూ కలిసి జీవించడం లేదని ఎర్రోల్ చెప్పారు.
ఎర్రోల్ జానా తల్లి హీడ్‌ని వివాహం చేసుకున్నప్పుడు జానా బెజుడెన్‌హౌట్‌కి నాలుగు సంవత్సరాలు, ఆమెతో 18 సంవత్సరాలు గడిపాడు అలాగే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీడ్ ఏరోల్ మస్క్ కంటే ముందే వివాహం నుండి జానాతో సహా ముగ్గురు పిల్లలకు తల్లి. ఎరోల్ మస్క్ ప్రకారం జానా మొదటి బిడ్డ 2017లో జన్మించాడు.
జానా బెజుడెన్‌హౌట్ ఎర్రోల్ రెండవ భార్య హైడ్ బెజుడెన్‌హౌట్ కుమార్తె. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఎరోల్, హైడ్ చివరికి 18 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు.
అతని కుటుంబం షాకింగ్ వార్తలకు ఎలా స్పందించిందని అడిగినప్పుడు 2017లో జానా మొదటి గర్భాన్ని గురించి ఎలోన్ మస్క్‌కి కాల్ చేసిందని అ సమయంలో వారి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని ఎర్రోల్ వెల్లడించారు. ఎలోన్ మస్క్ అతని తండ్రిని ఈ కారణంగా ఇప్పటికీ ఇష్టపడడు. ఎందుకంటే ఆమె అతని సోదరి కాబట్టి.
తొమ్మిది మంది పిల్లలకు తండ్రి
తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఏడుగురు పిల్లలకి తండ్రి అయిన ఎలోన్ మస్క్ గురించి ఒక నివేదికలో ఎలోన్ తన కంపెనీ న్యూరాలింక్‌లో పనిచేస్తున్న అధికారితో సంబంధంలో ఉన్నాడని, ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని వెల్లడించింది. ఈ విధంగా ఎలోన్ కు మొత్తం తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు, అయితే తల్లులు వేరు. ఇప్పుడు అతని తండ్రి ఈ షాకింగ్ న్యూస్ వెల్లడించిన తర్వాత, SpaceX అధినేత అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.
