Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ కొత్త బాస్.. టాప్ ప్లేస్ నుండి ఔట్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా..

ఫోర్బ్స్ ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్‌  సంపద 185.8 బిలియన్ డాలర్లు అంటే ఎలోన్  మస్క్ కంటే దాదాపు 400 మిలియన్ డాలర్లు ఎక్కువ. 

Elon Musk briefly loses worlds richest person title to Louis Vuitton CEO
Author
First Published Dec 8, 2022, 5:13 PM IST

 మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్త బాస్ అండ్ టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ని సంపదలో లూయిస్ విట్టన్ సి‌ఈ‌ఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ అధిగమించి  మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఫోర్బ్స్ ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్‌  సంపద 185.8 బిలియన్ డాలర్లు అంటే ఎలోన్  మస్క్ కంటే దాదాపు 400 మిలియన్ డాలర్లు ఎక్కువ. 

సంపదలో ఎలోన్ మస్క్  మొదటి స్థానాన్ని కొల్పవడానికి ముఖ్య కారణం ఏమిటంటే  ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలనే నిర్ణయం అని ఒక వార్తా పత్రిక  నివేదించింది, ఇందుకోసం టెస్లా సి‌ఈ‌ఓ 44 బిలియన్ డాలర్లను సమకూర్చారు. ఫలితంగా అతని సంపద 200 బిలియన్ డాలర్ల కంటే పైగా పడిపోయింది.

టెస్లా షేర్‌హోల్డర్‌ల ప్రకారం, ట్విటర్‌పై ఎలోన్ మస్క్  అపరిమితమైన శ్రద్ధ టెస్లా  స్టాక్ సైజ్ తగ్గిపోవడానికి ప్రేరేపించింది, స్పేస్ ఎక్స్ సి‌ఈ‌ఓ స్వయంగా దాదాపు 20 మిలియన్ షేర్లని దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకు విక్రయించాడు.

టెస్లా, ట్విటర్, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ  సి‌ఈ‌ఓ అండ్ అధినేత ఎలోన్ మస్క్   ఫ్రోబ్స్ బిలియనీర్ ర్యాంకింగ్స్‌లో  తన స్థానాన్ని తిరిగి పొందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios