న్యూ ఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల కోసం 1,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) మంగళవారం తెలిపింది.

ఈ భాగస్వామ్యంలో  ఇఇఎస్ఎల్ 1000 బిఎస్ఎన్ఎల్ సైట్లలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను దశలవారీగా ఏర్పాటు చేయనుంది.ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను  ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలం, విద్యుత్ కనెక్షన్‌లను అందించే బాధ్యత బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఉంటుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

also read ట్రంప్‌ విమానంలో ఉండే సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే...

"ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల కాన్ఫిడెన్స్ పెంచడానికి ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలను నిర్మించడం చాలా ముఖ్యమైనది. ఇది వినియోగదారుల సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు శ్రేణి ఆందోళనను కూడా తగ్గిస్తుంది.

భారతదేశం అంతటా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, సేవలను ఏర్పాటు చేయడంలో సినర్జిస్టిక్ యాక్షన్ కోసం బిఎస్ఎన్ఎల్ లో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది ”అని ఇఇఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమార్ అన్నారు.

also read ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

ఇఇఎస్ఎల్ భారతదేశం అంతటా 300 ఎసి ఇంకా 170 డిసి ఛార్జర్‌లను ప్రారంభించింది. ఇప్పటివరకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 66 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు పనిచేస్తున్నాయి.

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నోయిడా అథారిటీ, చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అండ్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, న్యూ టౌన్ కోల్‌కతా డెవలప్‌మెంట్ అథారిటీ, కళింగ విశ్వవిద్యాలయం రాయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్) లతో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.