Asianet News TeluguAsianet News Telugu

యస్‌ బ్యాంకు కుంభకోణంలో రాణా కపూర్‌కు షాక్‌.. వేల కోట్ల ఆస్తులు జప్తు..

ఈ కేసులో 1,400 కోట్ల రూపాయల విలువైన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవాన్‌కు చెందిన ఆస్ట్రేలియాలోని లాండ్, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, మహారాష్ట్రలోని సబ్ ఆర్బన్ ప్రాంతాలలో ఉన్న కొన్ని ఆస్తులను గుర్తించింది. 

ED attaches Rana Kapoor assets worth Rs 2,600 cr in YES Bank money laundering case
Author
Hyderabad, First Published Jul 9, 2020, 7:34 PM IST

యెస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రానా కపూర్, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డిహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లకు చెందిన భారతదేశం, విదేశాలలో  ఉన్న రూ.2,600 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్‌ఏ)చట్టం ప్రకారం అటాచ్ చేసింది

. ఈ ఆస్తులలో ఢీల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద ఉన్న  48 కోట్ల  ఖరీదైన రానా కపూర్ బంగ్లా, వర్లిలోని అతని ముంబై ఫ్లాట్లు ఇంకా 1,200 కోట్ల రూపాయల విలువైన ఇండియాబుల్స్ వన్ ఉన్నాయి. ఈ కేసులో 1,400 కోట్ల రూపాయల విలువైన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసింది.

డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవాన్‌కు చెందిన ఆస్ట్రేలియాలోని లాండ్, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, మహారాష్ట్రలోని సబ్ ఆర్బన్ ప్రాంతాలలో ఉన్న కొన్ని ఆస్తులను గుర్తించింది. కాగా యస్‌ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి రాణా కపూర్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి.

also read మరో ఆరు నెలల తర్వాతే కొత్త ఉద్యోగాల జోరు! ...

భారతదేశంలోని ఆస్తులు కాకుండా, లండన్‌లో రెండు కమర్షియల్‌ ప్రాపర్టీస్‌తోపాటు ఐదు లగ్జరీ కార్లు ఉన్నాయని, లండన్‌లోని 77 సౌత్ ఆడ్లీ స్ట్రీట్‌లోని అతిథి గృహంతో సహా ఫెడరల్ ఏజెన్సీ గుర్తించింది. ఢిల్లీ, ముంబైలలోనే కాకుండా లండన్, యుఎస్, యుకె, ఇతర ప్రదేశాలలో రాణా కపూర్ కుటుంబం, కంపెనీలకు చెందిన వేల కోట్ల విలువైన బంగ్లాలు, విల్లాస్, ఫామ్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లతో సహా అనేక ఆస్తులను ఈ‌డి జాబితా చేసింది.

 రాణా కపూర్‌ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్‌లో  పేర్కొంది. మార్చిలో అరెస్టు  అయిన కపూర్, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. రాణా కపూర్ యెస్ బ్యాంక్‌లో సి‌ఈ‌ఓ పదవీకాలంలో ఉన్నపుడు రుణాలు మంజూరు చేసినందుకు బదులుగా కార్పొరేట్‌ల నుండి కిక్‌బ్యాక్ రూపంలో పొందిన ఆదాయంలో ఈ ఆస్తులు ఉన్నట్లు ఈ‌డి ఆరోపించింది.

కపూర్‌కు చెందిన మరికొన్ని ఖరీదైన ఆస్తులు ఢీల్లీ, కౌటిల్య మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్‌ లో ఉన్నాయి. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో ఆయనకు 7.5 ఎకరాల బీచ్ ఫ్రంట్ లాండ్ కూడా ఉంది.  5,050 కోట్ల రూపాయల మనిలాండరింగ్ ఆరోపణలతో రానా కపూర్ ను  ఇడి మే నెలలో లో ప్రాసిక్యూషన్ కు ఫిర్యాదు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios