Asianet News TeluguAsianet News Telugu

హిండెన్ బర్గ్ దెబ్బ అదుర్స్...ఈ సారి ట్విట్టర్ మాజీ సీఈవో డోర్సే టార్గెట్..గంటలో రూ.80 వేల కోట్లు గోవిందా..

ఈసారి హిండెన్‌బర్గ్ ముందుగా చెప్పనట్లే గట్టి దెబ్బకొట్టాడు. కానీ అదానీ గ్రూప్ ను కాదు, అమెరికన్ వ్యాపారవేత్త ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే కంపెనీ పైన కావడం విశేషం. కొత్త నివేదికలో, హిండెన్‌బర్గ్ డోర్సే పేమెంట్స్ సంస్థ బ్లాక్ ఇంక్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. బ్లాక్ ఇంక్ లో మోసం, అవకతవకలు, ప్రభుత్వ సహాయాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేస్తూ నివేదిక విడుదల చేశాడు. హిండెన్‌బర్గ్ నివేదిక బయట పడగానే  బ్లాక్ ఇంక్‌కి పెద్ద దెబ్బ తగిలింది. కంపెనీ షేర్లు 20 శాతం వరకు పడిపోయాయి. కొన్ని గంటల్లోనే రూ. 80 వేల కోట్లు హుష్ కాకి అయ్యాయి. 

During the Hindenburg bombing, Jack Dorsey destroyed 800000 crores in one blow MKA
Author
First Published Mar 23, 2023, 11:28 PM IST

అదానీపై బాంబు పేల్చిన తర్వాత, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు ట్విట్టర్ మాజీ CEO జాక్ డోర్సే కంపెనీని లక్ష్యంగా చేసుకొని అతిపెద్ద ఆరోపణలు చేసింది. ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ ఇప్పుడు మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే పేమెంట్స్ కంపెనీ బ్లాక్ ఇంక్ ను టార్గెట్ చేసింది. మార్చి 23, గురువారం విడుదల చేసిన నివేదికలో, ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సేకు చెందిన పేమెంట్స్ సంస్థ బ్లాక్ ఇంక్ లో అవకతవకలు ఉన్నాయని  హిండెన్‌బర్గ్ ఆరోపించింది. పేమెంట్స్ బ్యాంకులో ఖాతా దారుల కన్నా కూడా బయటి వ్యక్తులకే ఎక్కువ సేవలు అందాయని పేర్కొంది.

ఆరోపణ ఇదే..

Block Inc అటు ప్రభుత్వానికి, కస్టమర్లను మోసం చేసిందని నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలను తుంగలో తొక్కడం ద్వారా కంపెనీ కృత్రిమంగా వినియోగదారులను సృష్టించింది. కృత్రిమంగా వినియోగదారులను సృష్టించి స్టాక్ మార్కెట్లో మదుపుదారులను తప్పుదారి పట్టించింది.

అంతేకాదు కరోనా సమయంలో ప్రభుత్వం అందించిన రిలీఫ్ ప్యాకేజీని కూడా దుర్వినియోగం చేసినట్లు హిండెన్ బర్గ్ ఆరోపించింది. అయితే హిండెన్‌బర్గ్ తాజాగా బ్లాక్ ఇంక్  షేర్లలో క్షీణతపై పందెం వేస్తూ బ్లాక్ ఇంక్‌లో షార్ట్ పొజిషన్ తీసుకున్నట్లు తెలిపింది.

"దాదాపు రెండు సంవత్సరాల పరిశోధన తర్వాత, Block Inc తన కస్టమర్లను క్రమపద్ధతిలో ఉపయోగించుకున్నట్లు మేము కనుగొన్నాము" అని హిండెన్‌బర్గ్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక నోట్‌లో తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన కొద్దిసేపటికే బ్లాక్ ఇంక్ షేర్లు 20 శాతం పడిపోయాయి. కొన్ని గంటల్లోనే బ్లాక్ ఇంక్ షేర్లు రూ.80,000 కోట్ల మార్కెట్ క్యాప్ నష్టాన్ని చవిచూసింది. బ్లాక్ ఇంక్ మార్కెట్ క్యాప్ 40 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. కంపెనీ 10 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.

బ్లాక్ ఇంక్ కంపెనీపై హిండెన్ బర్గ్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేసింది. కంపెనీ పాత పేరు స్క్వేర్ అని, ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 44 బిలియన్ డాలర్లని పేర్కొంది. అయితే స్క్వేర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సహాయంతో కంపెనీ మోసానికి పాల్పడిందని హిండెన్‌బర్గ్ తన నివేదికలో ఆరోపించింది. బ్యాంకులో ఖాతాలు లేని వారికి బ్యాంకర్లు సేవలు అందించారని ఆరోపించింది. జాక్ డోర్సే కు చెందిన  ఈ సంస్థ కరోనా సమయంలో లైమ్ లైట్ లోకి వచ్చింది.

కరోనా మహమ్మారి సమయంలో, బ్లాక్ ఇంక్. వ్యాపారం బాగా పెరిగింది. ఈ సమయంలో ఈ క్యాష్ యాప్ ద్వారా ప్రతినెలా  5.1 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఈ  యాప్ భారీ మొత్తంలో డబ్బు సంపాదించింది. అంతేకాదు కరోనా సమయంలో ప్రభుత్వానికి ఇచ్చిన రిలీఫ్‌లను కంపెనీ దుర్వినియోగం చేసిందని హిండెన్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది

జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ సర్జికల్ స్ట్రైక్ 
జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ ను అమాంతం పడేసింది. ప్రస్తుతం కొంత  రికవరీ ఉన్నప్పటికీ, ఇప్పటికీ అదానీ కంపెనీ షేర్లు పాత స్థాయికి చేరుకోలేదు.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్ ,  అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది ,  ఇది భారతదేశం, దాని సంస్థలు ,  వృద్ధి కథపై లెక్కించిన దాడి అని పేర్కొంది. హిండెన్‌బర్గ్ లాభం కోసం అబద్ధాలను మార్కెట్ చేయడానికి ప్రయత్నించిందని సమూహం పేర్కొంది. అయితే, హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌కు పెద్ద దెబ్బ ఇచ్చింది ,  అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ 15 వేల కోట్ల డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios