డ్యామేజ్ ప్రూఫ్ బాడీ, సూపర్ టెక్ అప్‌గ్రేడ్స్: అదిరిపోయే ఫీచర్స్‌తో OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్
డ్యామేజ్ ప్రూఫ్ బాడీ, ఎగ్జైటింగ్ టెక్ అప్‌గ్రేడ్స్‌తో OPPO సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్‌ను తీసుకొచ్చింది. అది కూడా వినియోగదారులకు అందుబాటులో ధరల్లో. ఈ కొత్త మోడల్‌లో ఉన్న అదిరిపోయే ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా...
భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OPPO దూసుకెళుతోంది. ఇప్పటికే అదిరిపోయే ఫీచర్స్ కలిగిన మోడళ్లతో కస్టమర్ల మనసు చూరగొంది. తాజాగా మరో సూపర్ మోడల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డ్యామేజ్ ప్రూఫ్ బాడీ, సూపర్ టెక్ అప్గ్రేడ్స్ తో తాజాగా OPPO A3 ప్రో మొబైల్ ను లాంచ్ చేసింది.
"ఒక అడుగు ముందుకు" అనే ట్యాగ్‌లైన్‌తో, OPPO కొత్తకొత్త ఆవిష్కరణలు చేస్తోంది. వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ కలిగిన మోడల్స్ అందిస్తోంది. తాజాగా డ్యామేజ్ ప్రూఫ్ బాడీతో సరికొత్త మోడల్ ను OPPO ఆవిష్కరించింది.
ఫీచర్స్ ఏంటంటే...
OPPO A3 Pro కస్టమర్లకు మంచి కిక్కించే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 128 GB వేరియంట్‌కు రూ.17,999.... 256GB వేరియంట్‌కు రూ.19,999 ధర నిర్ణయించింది. అది కూడా కటింగ్-ఎడ్జ్ డ్యూరబులిటీతో లాంగ్-లాస్టింగ్ పెర్ఫామెన్స్ తో హై-ఎండ్ డిజైన్‌తో అంటే మామూలు విషయం కాదు. డ్యామేజీ ప్రూఫ్ తో వస్తుండటం పైస్ వసూల్ ఆఫర్ అని చెప్పవచ్చు.
లేటెస్ట్ గా మార్కెట్లో లాంచ్ అయిన OPPO A3 Pro మోడల్ లో డ్యామేజ్ ప్రూఫ్ ఆల్ రౌండ్ ఆర్మర్ బాడీ అనే స్టాండ్-అవుట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. స్మార్ట్ మొబైల్ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేనివిధంగా మిలిటరీ స్టాండర్డ్ ఇంపాక్ట్ టెస్ట్ సర్టిఫికేషన్, స్విస్ SGS షాక్, ఫాల్ సర్టిఫికేషన్ కలిగిన డ్యూయెల్ సర్టిఫికేషన్ కలిగిన ఈ మోడల్ ట్యాంక్ లాగా పటిష్టంగా కనిపిస్తుంది. ఈ పరికరాన్ని మన్నికైనదిగా చేయడంలో OPPO నిజంగా దాని ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని పెంచింది.
ఇక, మదర్‌బోర్డు పై కవర్‌లోని హార్డ్‌వేర్ ఏరోస్పేస్-గ్రేడ్ నాణ్యత గల AM04 హై-స్ట్రెంత్ అల్లాయ్‌ను వాడారు. స్క్రీన్ ప్రొటెక్టివ్ గ్లాస్ 2-స్ట్రాంగ్ గ్లాస్ బలాన్ని కలిగి ఉంటుంది. ఇది పంక్చర్‌లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. అదనపు రక్షణ కోసం, యాంటీ-డ్రాప్ షీల్డ్ కేస్ కూడా అందిస్తోంది. దీంతో ఫోన్ ప్రమాదవశాత్తూ జారిపడినా డ్యామేజ్ ఫ్రీగా ఉంటుంది.
తడి చేతులతోనూ పర్ఫెక్ట్ టచ్ ఆపరేషన్...
OPPO A3 Pro మోడల్‌లో మరో ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఇప్పటివరకు తడి చేతులతో ఫోన్ వాడాలంటే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే, ఇప్పుడా భయం అక్కర్లేదు. చెమటలు పట్టిన చేతులతో లేదా తడి చేతులతో పట్టుకోవడానికి ఇకపై ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే OPPO A3 Pro ఫ్లాగ్‌షిప్ స్ప్లాష్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. తడి, తేమ చేతులతో ఈజీగా ఈ ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. IP54 సర్టిఫికేషన్‌తో వచ్చిన OPPO A3 Pro రోజువారీ స్ప్లాష్‌లను, దుమ్మును సులభంగా తట్టుకోగలదు.
థిన్.. లైట్.. ఎలిగెంట్...
OPPO A3 Pro కేవలం 7.68mmతో సూపర్ స్లిమ్, ఇంకా బరువు 186 గ్రామాలు మాత్రమే. దీని ఆకర్షణీయమైన హై-గ్లాస్ మిడిల్ ఫ్రేమ్ డిజైన్ మెటాలిక్‌గా కనిపిస్తుంది. ఫింగర్‌ప్రింట్ రెసిస్టెన్స్‌తో అందమైన మాట్ మిడిల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ సమాన నిష్పత్తులతో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది.
ప్రో మూన్‌లైట్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్స్‌లో ఈ మోడల్ అందుబాటులో ఉంది.
అవుట్ డోర్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడేయవచ్చు. 120Hz, 90Hz, 60Hz రిఫ్రెష్ రేట్‌లతో 120Hz అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ప్రత్యేకమైన సన్‌లైట్ మోడ్ ఉండటం కారణంగా సన్‌లైట్‌లోనూ ఈజీగా వినియోగించవచ్చు. ఎందుకంటే స్క్రీన్ లైటింగ్‌ని ఆటోమేటిక్‌గా 1000 నిట్‌ల వరకు పెంచుతుంది. అదనంగా, ఐ- ప్రొటెక్షన్ మోడ్ హార్డ్‌వేర్-స్థాయి 0 ఫ్లికర్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా సుదీర్ఘ ఫోన్ వినియోగం నుండి కంటి అలసట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది మరింత సౌకర్యవంతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.
భద్రత-మెరుగైన బ్యాటరీ వ్యవస్థ...
OPPO A3 ప్రోలోని బ్యాటరీ భారీ వినియోగదారులను కూడా సంతృప్తిపరిచేలా తయారైంది. దీని 5100mAh హైపర్-ఎనర్జీ బ్యాటరీ వేగవంతమైన, ఇంకా సురక్షితమైన ఛార్జింగ్ కోసం 45W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జ్‌తో వస్తుంది. అదనంగా, కొత్త A/B డయాఫ్రామ్ మెరుగైన బ్యాటరీ పనితీరు, స్థిరత్వాన్ని కలిగి ఉంది. OPPO ల్యాబ్‌లో 1600 ఛార్జింగ్, డిశ్చార్జింగ్ పరీక్షలను నిర్వహించారు. ఇది ఇండస్ట్రీ ప్రమాణాలకు రెండింతలు.. నాలుగు సంవత్సరాల పాటు బ్యాటరీ మన్నికకు హామీ ఇస్తుంది.
OPPO A3 ప్రో మృదువైన నెట్‌వర్క్ స్విచింగ్ సేవల సూట్‌తో వస్తుంది. దీని AI లింక్‌బూస్ట్ అన్ని స్థానాల్లో స్థిరమైన కనెక్షన్‌లను నిర్ధారించడానికి సిస్టమ్-స్థాయి AI మోడల్‌ను ఉపయోగిస్తుంది. ఇది బలహీనమైన నెట్‌వర్క్ ప్రాంతాల్లోనూ స్థిరమైన కనెక్షన్‌ని కూడా నిర్ధారిస్తుంది. అన్ని సమయాల్లో కనెక్ట్ అయి ఉండడాన్ని సులభతరం చేస్తుంది.
OPPO A3 Pro యొక్క 50 MP AI డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.. ఫోటో ఎడిటింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తాయి. ఇది ఫోటోల్లోని ఆబ్జెక్ట్స్‌ను గుర్తించి.. అవసరమైన ఎలిమినేషన్స్ చేస్తుంది.
OPPO A3 Pro ఎక్స్‌పాండబుల్ RAM, MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 50-నెలల పటిష్ట రక్షణను అందిస్తుంది.Color OS 14తో 5Gలో పనిచేస్తుంది.
ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్‌ను మార్కెట్‌లో మరింత సులభతరంగా కొనుగోలు చేయవచ్చు. దానికి సంబంధించిన ఆఫర్లు ఇవే...
* HDFC, SBI,ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసి 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు (T&C apply).
* ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా 6 నెలల వరకు నో-కాస్ట్ EMI అందుబాటులో ఉంది.