Asianet News TeluguAsianet News Telugu

ఉగాది-రంజాన్ ఫెస్టివల్.. అమాంతం పెరిగిపోతున్న మాంసం ధర, కిలో మటన్ ఎంతంటే..?

డిమాండ్‌ కారణంగా చికెన్‌, మటన్‌ ధరలు కూడా అధికంగా పెరిగాయి. కొన్ని మెట్రో నగరాలలో కిలో స్కిన్‌ లెస్ చికెన్ 300 రూపాయలు. ట్రాన్స్‌ప్లాంట్ చికెన్ కిలో 400 రూపాయలు, ఫామ్ చికెన్ 160 రూపాయలు, బాయిలర్ చికెన్ 200 రూపాయలు, స్కిన్ తో చికెన్ 280 రూపాయలు, బోన్ లెస్ చికెన్ 520 రూపాయలు పలుకుతుంది.

Due to Ugadi-Ramzan festival  price of meat has skyrocketed 850 rupees per kg of mutton-sak
Author
First Published Apr 10, 2024, 4:39 PM IST

 ఉగాది, రంజాన్‌ పండుగలు కలిసి రావడంతో మాంసానికి డిమాండ్‌ పెరిగి వీటి ధర అమాంతంగా పెరిగిపోతుంది. నిన్న ఉగాది పండుగ ఈ రోజున తీపి లేదా పిండి వంటలు అలాగే స్వీట్స్ చేయడం  అదే రోజున కొత్త పనులు చేయడం ఆనవాయితీ. దీనికి తోడు  రంజాన్ పండుగ రావడం మాంసం ధర రెట్టింపు అవుతుంది. రంజాన్ మాసంలో లభించే హలీంని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. 

డిమాండ్‌ కారణంగా చికెన్‌, మటన్‌ ధరలు కూడా అధికంగా మారాయి. కొన్ని మెట్రో నగరాలలో కిలో స్కిన్‌ లెస్ చికెన్ 300 రూపాయలు. ట్రాన్స్‌ప్లాంట్ చికెన్ కిలో 400 రూపాయలు, ఫామ్ చికెన్ 160 రూపాయలు, బాయిలర్ చికెన్ 200 రూపాయలు, స్కిన్ తో చికెన్ 280 రూపాయలు, బోన్ లెస్ చికెన్ 520 రూపాయలు పలుకుతుంది. ఇక  కేజీ మటన్ ధర రూ.850 పెరిగింది. అంతేకాదు ధరలు పెరగడంతో ఒకవైపు వేసవి తాపానికి మరోవైపు ప్రజలు మాంసాహారం కొనాలంటే జంకుతున్నారు.

కొన్ని పట్టణాలలో నాన్‌వెజ్‌ ప్రియులు క్యూలో నిలబడి మరి మాంసం కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రదేశాలలో  ఉదయం నుంచే జనం బారులు తీరుతున్నారు. ఒక విధంగా నిన్న మొన్నటి దాక పెళ్లిళ్లు, ఇతర వేడుకల కారణంగా కూడా మాంసం డిమాండ్ పెరిగింది.  

గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతుండడంతో నగరంలో కూరగాయలు, చికెన్, చేపలు, మాంసం ధరలు కూడా పెరుగుతుండడం  ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ధరల పెరుగుదల వచ్చే నెలన్నర వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 

పండగ రోజుల్లో మినహా సాధారణంగా మెట్రో నగరాల్లో అలాగే కేజీ చికెన్ రూ.180 నుండి రూ. 250 పలికేది. అలాగే కేజీ మటన్ ధర రూ.650 నుండి రూ.750 పలికింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios