Asianet News TeluguAsianet News Telugu

కరోనా పేషెంట్ల కోసం ఎస్‌పిఓ2 ఆధారిత ఆక్సిజన్ డెలివరీ సిస్టంను అభివృద్ధి చేసిన డి‌ఆర్‌డి‌ఓ

డి‌ఆర్‌డి‌ఓ  బెంగళూరు, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ & ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ (డి‌ఈ‌బి‌ఈ‌ఎల్) చేత అభివృద్ధి చేయబడిన ఈ సిస్టం SpO2 స్థాయిల ఆధారంగా  ఆక్సిజన్‌ను అందిస్తుంది అలాగే ఒక వ్యక్తిని హైపోక్సియాలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది.

DRDO develops SpO2 based Supplemental Oxygen Delivery System: A boon in current COVID-19 pandemic
Author
Hyderabad, First Published Apr 19, 2021, 7:07 PM IST

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి‌ఆర్‌డి‌ఓ) ఎత్తైన ప్రదేశాలలో ఉన్న సైనికుల కోసం ఎస్‌పి‌ఓ2(SpO2)  (బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్) ఆక్సిజన్ డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

డి‌ఆర్‌డి‌ఓ  బెంగళూరు, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ & ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ (డి‌ఈ‌బి‌ఈ‌ఎల్) చేత అభివృద్ధి చేయబడిన ఈ సిస్టం SpO2 స్థాయిల ఆధారంగా  ఆక్సిజన్‌ను అందిస్తుంది అలాగే ఒక వ్యక్తిని హైపోక్సియాలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది.  ఎందుకంటే చాలా సందర్భాలలో హైపోక్సియా ప్రాణాంతకంగా మారుతుంది.  ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిలో ఈ ఆటోమేటిక్ సిస్టమ్ కూడా ఒక వరం అని నిరూపించగలదు.

హైపోక్సియా అనేది మానవ శరీరంలోని అన్ని అవసరాలను తీర్చడానికి  కణజాలాలకు చేరే ఆక్సిజన్  సరైనంతగా లేకపోవడం. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కోవిడ్-19 రోగులలో కొందరికి ప్రస్తుతం ఇదే పరిస్థితి. 

ఈ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సిస్టమ్  బారోమెట్రిక్ ప్రేజర్, తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ కలిగి ఉన్న తీవ్రమైన ఎత్తులో ఉపయోగపడేల రూపొందించారు.

 ఈ సిస్టమ్ మణికట్టు వద్ద ధరించిన పల్స్ ఆక్సిమీటర్ మాడ్యూల్ నుండి వైర్‌లెస్ ఇంటర్‌ఫేస్ ద్వారా  SpO2 స్థాయిలను చదువుతుంది. అలాగే దీని  సోలేనోయిడ్ వాల్వ్‌ ఆక్సిజన్ సప్లయిని నియంత్రిస్తుంది. లైట్ వేట్ పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ నుండి ముక్కు రంద్రాల ద్వారా ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది.

 ఈ సిస్టం  1 లీటర్ ఒక కే‌జి బరువుతో  150 లీటర్ల ఆక్సిజన్ సప్లయి, 10 లీటర్లు & 10 కిలోల బరువుతో 1,500 లీటర్ల ఆక్సిజన్ సప్లయితో వివిధ పరిమాణాలలో లభిస్తుంది. ఇది నిమిషానికి రెండు లీటర్ల నిరంతర ప్రవాహంతో 750 నిమిషాల పాటు ఆక్సిజన్ అందిస్తుంది (ఎల్పిఎమ్ )

ఈ వ్యవస్థ ప్రస్తుత కరోనా వ్యాప్తి కాలంలో  ఒక వరం లాంటిది, ఎందుకంటే  2/5/7/10 ఎల్‌పిఎమ్ ప్రవాహంతో కంట్రోల్ చేసే ప్రవాహంతో ఆక్సిజన్ ఫ్లో తెరపీ కోసం మొడ్రేట్ కోవిడ్ రోగులకు ఇంట్లో ఉపయోగపాడుతుంది. ఇంట్లో ఉన్నవారికి ఆటోమేటిక్ వినియోగం భారీ ప్రయోజనాన్ని ఇస్తుంది, ఎందుకంటే  దీని ఆక్సిమీటర్ తక్కువ SpO2 వాల్యు ఉంటే అలారం ఇస్తుంది. 2,5,7,10 ఎల్‌పిఎమ్ ఫ్లో రేటు వద్ద ఆటో అడ్జస్ట్ చేయగల SpO2 సెట్టింగ్ ఆధారంగా  ఆక్సిజన్ (O2) ప్రవాహాన్ని ఆటోమేటిక్ గా పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. 

దీని లభ్యత, సాధారణ వ్యక్తి కూడా ఉపయోగించుకునే సదుపాయంతో ఒక పేషెంట్ SpO2 స్థాయిని పర్యవేక్షించడానికి వైద్యులు లేదా  పారామెడిక్స్ పనిభారం, సమయాన్ని ఈ వ్యవస్థ చాలా తగ్గిస్తుంది. ఆటోమేటెడ్ కాలిబ్రెటెడ్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ (పిఎఫ్‌సివి) ద్వారా తక్కువ O2 స్థాయిలకు (యూజర్ ప్రీ-సెట్, <90%, <80%) ఆటోమేటెడ్ కాలిబ్రేటెడ్ వేరియబుల్ ఫ్లో కంట్రోల్ ఆక్సిజన్ సప్లయి (1-10 ఎల్‌పిఎమ్‌తో ± 0.5 ఎల్‌పిఎమ్‌తో) సులభతరం చేస్తుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios