ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ధర ఎంతో తెలుసా.. ఇక్కడ ఒక్క గుడ్డు ధర వాటర్ బాటిల్ కంటే ఎక్కువ.. షాకింగ్..
గత పదేళ్లలో దేశంలో గుడ్ల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు గుడ్ల ధర కూడా అమాంతం తార స్థాయికి చేరాయి.
గుడ్ల ధర ఒకానొక సమయంలో అతితక్కువ ధర నుండి నేడు అత్యధిక స్థాయికి చేరింది. అయితే గుడ్లలో ఉండే పోషకాలు మనకి చాలా అవసరం.
ఒక ట్విట్టర్ పోస్ట్ ప్రకారం, వివిధ దేశాల్లో గుడ్ల ధర చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఈ గుడ్లు బ్రాయిలర్ కోడి గుడ్ల లేక నాటు కోడి గుడ్ల అనేది తేలినప్పటికీ,
స్విజర్లాండ్ లో గుడ్ల ధర ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండగా అతితక్కువ ధర ఎక్కడో తెలిస్తే నిజంగా నమ్మలేరు. అయితే స్విజర్లాండ్ ఒక డజన్ గుడ్ల ధర రూ.560 ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక గుడ్డు ధర సుమారు రూ.46 పైనే.
గుడ్లు అమ్ముడవుతున్న దేశాల లిస్టులో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది.
తరువాత స్థానాల్లో న్యూజిల్యాండ్, యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, లక్సమ్బెర్గ్, ఉరుగాయ్, ప్యూర్టో రికో, జార్డన్, ఈక్వెడార్, కొలంబియా, చైనా, జపాన్, ఇరాన్, బెలారస్, పాకిస్థాన్, రష్యా, ఇండియా ఉన్నాయి.
గత పదేళ్లలో చేస్తే ఇండియాలో గుడ్ల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీనితో పాటు గుడ్ల ధర కూడా భారీగా పెరిగాయి.
అయితే ఇండియాలో డజన్ గుడ్లకు రూ.79 కాగా, ఒక్క గుడ్డు ధర రూ.6.50 పైసలు. పాకిస్థాన్లో డజన్ గుడ్లకు రూ.90 అంటే ఒక్కో గుడ్డు ధర రూ.7.50 పైసలు.
మరోవైపు అమెరికాలో డజన్ గుడ్ల ధర రూ.359, దీని ప్రకారం చూస్తే ఒక్క గుడ్డుకి వాటర్ బాటిల్ కంటే ఎక్కువ ధరకు సుమారు రూ.30 లభిస్తుంది.