ఉపాధి వీసాలను పరిమితం చేయాలన్న ఆలోచనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త నియంత్రణలు విధించనున్నట్లు తెలిపారు. ఇది టెక్నాలజి నుండి ఆర్థిక, హాస్పిటలిటి వరకు ఉన్న అన్నీ పరిశ్రమలలో యు.ఎస్‌లో పనిచేయడానికి ప్రయత్నిస్తున్న 2,40,000 మంది ప్రజలపై ఈ ప్రభావం పడనుంది.

ఆదివారం లేదా సోమవారం వివిధ వర్క్ వీసాలపై కొత్త నియంత్రణలు ప్రకటించనున్నట్లు ఒక న్యూస్ ఇంటర్వ్యూలో డొనాల్డ్  ట్రంప్ చెప్పారు. అయితే ఈ నియంత్రణలు ఇప్పటికే యు.ఎస్‌లో ఉన్న కొంతమంది కార్మికులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు. కాకపోతే చాలా తక్కువ మినహాయింపులు ఉంటాయి, 

హై స్కిల్డ్ వర్కర్స్ కోసం హెచ్-1బి వీసా ప్రోగ్రామ్, సంస్థలలో ట్రాన్స్ఫర్ అయ్యే మానేజర్స్ కోసం ఎల్-1వీసా ప్రోగ్రామ్, హెచ్-2బి వీసాలతో సహా పలు వేర్వేరు వీసాలపై రాబోయే నిబంధనల గురించి అడిగినప్పుడు సమాధానంగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

పరిశీలనలో ఉన్న నియంత్రణల కారణంగా 180 రోజుల వరకు హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌తో సహా వివిధ వీసా కేటగిరీకి చెందిన ప్రజలు యు.ఎస్‌లోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తుంది. ఈ ప్రతిపాదన గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతు కొత్త నియంత్రణలకు ముందు మంజూరు చేసిన అన్నీ వీసాలు కూడా కొత్త ఆర్డర్ గడువు ముగిసే వరకు అమెరికాలోకి ప్రవేశించలేరు అని తెలిపారు.

also read డ్రాగన్‌ పైనే గురి: ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. ...

ఈ కొత్త చర్య వల్ల వందలాది కంపెనీలలో పనిచేసే వేలాది మంది ప్రజలపై ప్రభావితం కానుంది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఒక సంస్థతో ఉపాధిని ప్రారంభించిన సుమారు 1,33,000 మంది కార్మికులకు హెచ్ -1బి వీసా లభించింది.

మొత్తం దరఖాస్తులలో 12,000 మందికి పైగా ఎల్ -1 వీసాలు, 98,000 మందికి పైగా హెచ్ -2బి వీసాలు జారీ చేశారు. మినహాయింపులను మినహాయించి ట్రంప్ కొత్త నియంత్రణ ప్రణాళిక వల్ల ఈ మూడు వర్క్ వీసాల ఆధారంగా 2,40,000 మందికి పైగా ప్రభావం పడనుంది.

దీనిపై ట్రంప్ ట్వీట్ చేస్తూ "యు.ఎస్ లోకి వచ్చే వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని" యోచిస్తున్నాట్లు అన్నారు. యు.ఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్ వంటి ఇండస్ట్రి గ్రూపూలు నియంత్రణల కరణంగా వ్యాపారానికి విఘాతం కలుగుతాయని అలాగే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని డొనాల్డ్  ట్రంప్ కి రాసిన లేఖలో  తెలిపారు.


గత కొన్నేళ్లుగా, హెచ్ -1బి కార్యక్రమాన్ని కఠినతరం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కదులుతోంది, దీంతో హెచ్ -1బి దరఖాస్తుల ఆమోదం రేటు కూడా పడిపోయింది. టెక్నాలజీ పరిశ్రమలో విదేశీ ప్రతిభను, ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ రంగాలలో నియమించుకోవడానికి హెచ్ -1బి వీసాలపైనే ఆధారపడింది.