మీ దగ్గర 50 పైసలు లేదా 1 రూపాయి కాయిన్ ఉందా.. అయితే ఈ విషయం తెలుసుకోండి.. RBI ఏం చెబుతుందంటే..?
నేడు ప్రజలు ఆ కాయిన్లతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అది మార్కెట్ అయినా, బస్సు అయినా, ఆటో అయినా. ఎవ్వరూ కాయిన్లను తీసుకోవాట్లేదు. 2 రూపాయల నాణేలు ఇప్పటికీ మార్కెట్‌లో చలామణిలో ఉన్నాయి, అయితే 1 రూపాయి కాయిన్లను మార్కెట్‌లో చెలామణి చేయడం దాదాపు కష్టంగా మారుతుంది.
బస్ టికెట్, ఆటో ఛార్జీలు, షాపుల్లో చెల్లించేటప్పుడు లేదా ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు చాలా మంది 1 రూపాయి కాయిన్ తో సమస్యలను ఎదుర్కొంతుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా 1 రూపాయి లేదా 2 రూపాయల కాయిన్లు మార్కెట్‌లో స్వేచ్ఛగా చెలామణి అయ్యేవి, నేడు ప్రజలు ఆ కాయిన్లతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అది మార్కెట్ అయినా, బస్సు అయినా, ఆటో అయినా. ఎవ్వరూ కాయిన్లను తీసుకోవాట్లేదు. 2 రూపాయల నాణేలు ఇప్పటికీ మార్కెట్‌లో చలామణిలో ఉన్నాయి, అయితే 1 రూపాయి కాయిన్లను మార్కెట్‌లో చెలామణి చేయడం దాదాపు కష్టంగా మారుతుంది.
అయితే ఎందుకు ఇలా జరుగుతుంది ? ఈ ఒక్క రూపాయి కాయిన్ కి ఎం జరిగింది ? మార్కెట్‌లో 1 రూపాయి కాయిన్ చెల్లుబాటుపై చాలా మందికి స్పష్టమైన అవగాహన లేదు. చాలా మంది కస్టమర్లు 1 రూపాయి లేదా రెండు రూపాయల కాయిన్లను తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఈ 1 రూపాయి లేదా 2 రూపాయల కాయిన్ల వినియోగం క్రమంగా తగ్గుతోంది.
1 రూపాయి లేదా 2 రూపాయి కాయిన్లు చట్టబద్ధంగా ఉన్నాయా?
భారతదేశంలో కాయిన్లు ప్రస్తుతం 50 పైసా నుండి 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల వరకు కాయిన్లు చెలామణిలో ఉన్నాయి. కాయిన్లు వివిధ డిజైన్లలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయిన్లు చెల్లుబాటవుతున్నాయా అనేది ప్రశ్న. ఈ నేపథ్యంలో 25 పైసలు లేదా అంతకంటే తక్కువ విలువైన కాయిన్ల పైనే నిషేధం విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. పైన తెలిపిన కాయిన్లలో దేనిపైనా పరిమితులు లేవు.
50 పైసల కాయిన్లు విలువైనవా?
50 పైసల విషయంలో కూడా ఎలాంటి పరిమితి లేదని ఆర్బీఐ తెలిపింది. అంటే, మీరు ఈ కాయిన్ ఉపయోగించి సులభంగా ఖర్చు లేదు కొనుగోలు చేయవచ్చు.
రూ.1 కాయిన్ స్వీకరణ
25 పైసలు, అంతకంటే తక్కువ విలువ కాయిన్ల మినహా మరే ఇతర విలువ గల కాయిన్లు వాడకాన్ని ఆపలేదని ఆర్‌బీఐ తెలిపింది. అంటే, మీరు ఈ కాయిన్లను దుకాణాలు, మార్కెట్లు, బస్సులలో సులభంగా ఉపయోగించవచ్చు. ఎవరైనా ఈ నాణేలను తీసుకోవడానికి నిరాకరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బీఐకి సమాచారం అందించింది.