ప్రతినెలా డబ్బు కావాలా? సీనియర్ సిటిజన్లకు బెస్ట్ ప్లాన్.! మీకు రూ.41 వేల వడ్డీ

ఒక సీనియర్ సిటిజన్ SCSS అకౌంట్ తెరిచేటప్పుడు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. త్రైమాసిక ఆదాయంగా పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందామా... 

Do you want income after retirement? Best savings plan for senior citizens.!!-sak

మీరు ప్రతినెలా జీతం లేదా బిజినెస్ నడుపుతున్నంత కాలం మీ రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి డబ్బు అవసరం. కానీ మీ వయస్సు, రిటైర్మెంట్ టైం వచ్చే కొద్దీ మీ ఇన్కమ్  సోర్సెస్ తగ్గిపోవచ్చు.  ప్రతినెలా లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీకు రాబడిని ఇచ్చే పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇందుకు పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్స్ నిర్వహిస్తుంది. ఒక్కసారి పెట్టుబడితో ఈ స్కీమ్‌ త్రైమాసిక రాబడిని అందిస్తుంది.

ఒక సీనియర్ సిటిజన్ SCSS అకౌంట్ తెరిచేటప్పుడు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. ఆదాయాన్ని త్రైమాసికంగా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా మీరు ఎంత త్రైమాసిక ఆదాయాన్ని పొందవచ్చో చూద్దాం... దానికి ముందు SCSS గురించి పూర్తిగా తెలుసుకోండి. అయితే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ ఏడాదికి వడ్డీ రేటు 8.2 శాతం అందిస్తుంది.

డిపాజిట్ చేసిన తేదీ నుంచి 31 మార్చి/ 30 సెప్టెంబర్/ 31 డిసెంబర్ వరకు ఇంకా ఆ తర్వాత 1 ఏప్రిల్, 1 జూలై, 1 అక్టోబర్ ఇంకా  1 జనవరిలో వడ్డీ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తి రూ.1,000 పైగా  మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. అలాగే గరిష్ట మొత్తం రూ.30 లక్షలకు మించకూడదు. ఈ పథకంలో లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు. అయితే, కస్టమర్ అకౌంట్ పిరియడ్ పొడిగించుకోవచ్చు.  

50 ఏళ్లు పైబడిన, 60 ఏళ్ల లోపు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది SCSS అకౌంట్  కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SCSS పథకంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హులు.  

రూ. 5 లక్షల పెట్టుబడిపై, మీ త్రైమాసిక వడ్డీ రూ. 10,250 అలాగే  ఐదేళ్ల తర్వాత మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 7,05,000 అవుతుంది. రూ. 10 లక్షల వన్-టైమ్ డిపాజిట్ కోసం మీరు రూ. 14,10,000 మెచ్యూరిటీ మొత్తంతో రూ. 20,500 వడ్డీని పొందవచ్చు. మీరు ఈ పథకంలో రూ.20 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు రూ.41,000 వడ్డీ లభిస్తుంది అండ్ మెచ్యూరిటీ మొత్తం రూ.28,20,000.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios