పోస్టాఫీసు స్కీముల్లో ఏ స్కీంలో డబ్బులు పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసా..? అయితే పూర్తి వివరాలు మీ కోసం..

మీరు సంపాదించే సంపాదనలో కొంత మొత్తం పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో అది చాలా ఉపయోగపడుతుంది లేకపోతే, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ డబ్బు లభించక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మన దేశంలో పోస్ట్ ఆఫీస్ ను మించిన సురక్షితమైన స్కీం మరొకటి లేదనే చెప్పాలి గ్యారెంటీ రిటర్న్స్ ప్రభుత్వ నమ్మకం రెండూ కలవడం వల్ల చాలామంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బు పొదుపు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Do you know which of the post office schemes gives you the highest interest? But the full details are for you mka

మన భవిష్యత్తు, మన కుటుంబం బాగుండాలని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేస్తున్నారా లేదా భవిష్యత్తులో మీకు డబ్బు అవసరం కాబట్టి దాన్ని వేరే చోట పెట్టుబడి పెడుతున్నారా అనే అంశం గుర్తించాలి.  అలా పొదుపు చేసిన డబ్బు భవిష్యత్తులో మనకు ఊతకర్ర అవుతుంది. డబ్బు ఆదా చేయడానికి అనేక రకాల పథకాలు ఉన్నాయి. అనేక ప్రైవేట్,  ప్రభుత్వ సంస్థలు వివిధ వడ్డీ రేట్లలో డిపాజిట్ స్కీం లను అందుబాటులో ఉంచాయి. మధ్యతరగతి, పేదలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేరు. కాబట్టి వారు చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టడంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇలా తక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసే వారి కోసం భారతీయ తపాలా శాఖ అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేసింది.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (RD) : 

పోస్టాఫీసులో ఇప్పటికే కిసాన్ వికాస పత్ర, సుకన్య సమృద్ధి యోజన, SCSS మొదలైన అనేక పథకాలు ఉన్నాయి. పోస్టాఫీసు పథకాలను దేశంలోని శ్రామిక వర్గం, మద్యతరగతి వర్గం ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఇది సురక్షితమైన పెట్టుబడి, దీనిలో ఎటువంటి సందేహం లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లేదా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఎక్కువ లాభం పొందవచ్చు. ఇందులో మీరు రూ.100 పెట్టుబడితో ప్రారంభించి రూ.1,41,983 తిరిగి పొందవచ్చు.

ప్రస్తుతం ప్రభుత్వం రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటును 6.2 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. వివిధ నెలవారీ డిపాజిట్లకు మెచ్యూరిటీ మొత్తం భిన్నంగా ఉంటుంది. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కోసం ప్రతి నెలా రూ. 2000 ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ సమయంలో రూ. 1,41,983 పొందవచ్చు. నెలకు రూ.2000 పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.24,000 రాబడి వస్తుంది. ఉద్యోగులు ప్రతి నెలా రూ. 3000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.2,12,971 పొందుతారు. మీరు ప్రతి నెలా 4000 రూపాయలు పెట్టుబడి పెట్టగానే మీ డబ్బు మొత్తం 48000 రూపాయలు  5 సంవత్సరాలలో అది 2,83,968 రూపాయలు అవుతుంది.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో త్రైమాసికానికి వడ్డీ వసూలు చేస్తారు. పెట్టుబడిదారుల డబ్బు ఇక్కడ సురక్షితం. పెట్టుబడిదారులు వడ్డీ రూపంలో స్థిరమైన డబ్బును పొందవచ్చు. ఇది స్థిరమైన మొత్తాన్ని  స్థిర ఆదాయాన్ని పొందేందుకు ప్రజలను అనుమతిస్తుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీములు రిస్క్ లేని పెట్టుబడి. దేశవ్యాప్తంగా 1.54 లక్షల పోస్టాఫీసులు వివిధ పథకాల కింద ఉన్నాయి.

చాలా మంది ప్రజలు తమ కష్టార్జితాన్ని ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో పెట్టి మోస పోయే బదులు పోస్టాఫీసు కింద ఇటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు వల్ల ఎలాంటి భయం లేకుండా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios