ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ హౌస్ డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ముఖేష్ అంబానీ డ్రైవర్ కూడా విలాసవంతంగా జీవిస్తున్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇందుకు అతని ప్రతినెల జీతమే ఉదాహరణ.
రిలయన్స్‌కు చెందిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇద్దరూ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ప్రముఖులు. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లు వీరి సొంతం కావడం అంబానీ కుటుంబానికి మరో గర్వకారణం.
అంబానీ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే ముఖేష్ అంబానీ డ్రైవర్ కూడా విలాసవంతంగా జీవిస్తున్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇందుకు అతని ప్రతినెల జీతమే ఉదాహరణ.
ముఖేష్ అంబానీకి డ్రైవర్‌గా ఉండటం అంత తేలికైన విషయం కాదు. అంబానీ కుటుంబంలోని విలాసవంతమైన జీవితంలో పని చేయడానికి అతనికి సూపర్ డూపర్ టాలెంట్ అవసరం. అంబానీ హౌస్ డ్రైవర్ ఉద్యోగానికి కూడా కఠినమైన ఇంటర్వ్యూ ఉంటుందని మీకు తెలుసా? ఇందుకోసం ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం ఇప్పించినట్లు సమాచారం.
జీతం ఎంత అని ఆశ్చరంగా ఉందా ? ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలకు దాదాపు 2 లక్షలు అందుకుంటున్నారు. మరోక హైలెట్ విషయం ఏంటంటే.. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వారికి కూడా ముఖేష్ అంబానీ హౌస్ డ్రైవర్ జీతం కంటే తక్కువ వేతనం పొందుతున్నారు.
ముఖేష్ అంబానీ డ్రైవర్ కి ఇంత జీతం ఇవ్వడానికి ఒక కారణం కూడా ఉంది. అంటే అంబానీ వద్ద ఉన్నవన్నీ ఖరీదైన కార్లు. అందుకే అతని స్కిల్స్ కలిగిన డ్రైవర్‌కు అధిక జీతం చెల్లిస్తారు.
అంబానీ ఇంట్లో పనిచేసే ముఖ్యమైన డ్రైవర్ 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు జీతం అందుకున్నట్లు సమాచారం. ఇతర డ్రైవర్లకు కనీసం రూ.2 లక్షల జీతం పొందుతున్నట్లు చెబుతున్నారు.
