న్యూఢిల్లీ: మీ వ్యక్తిగత వివరాలు, ఖాతాల నెంబర్లు, ఓటీపీల గురించి మేమెప్పుడూ అడగం, మీరు కూడా ఎవరితో పంచుకోకండి అంటూ బ్యాంకులు, పేటీఎం వంటి ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థలు పదే పదే చెబుతూనే ఉంటాయి. తాజాగా ఆ జాబితాలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కూడా ఇదే హెచ్చరికల్ని జారీ చేసింది.

మీ ఆధార్‌/పాన్‌/యూఏఎన్‌/బ్యాంకు ఖాతాల్లాంటి వ్యక్తిగత వివరాలను ఈపీఎఫ్ఓ ఎప్పుడూ అగడదు. ఫలానా ఖాతాల్లో డబ్బులు వేయాలంటూ ఎప్పుడూ విజ్ఞప్తి చేయదు.

అటువంటి నకిలీ ఫోన్‌ కాల్స్‌కు ఎప్పుడూ స్పందించకండి అని తమ వెబ్‌సైట్లో ఈపీఎఫ్ఓ ప్రకటించింది. వెబ్‌సైట్లు, టెలీకాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, సోషల్‌మీడియా ఖాతాల నుంచి ఆఫర్లు వచ్చినా, వాటిని తిరస్కరించాలంటూ సూచించింది.

రిలయన్స్ జియో రీఛార్జీలపై పేటీఏం బంఫర్ ఆఫర్
 
ఇప్పటి వరకూ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌(యూఏఎన్‌) కావాలంటే కార్మికులు తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా పొందాల్సి వచ్చేది. వీరు సంస్థ మారాలనుకున్నప్పుడు, ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు వారిని ఇబ్బంది పెట్టేవి. అయితే.. ఇకపై ఈ బాధల నుంచి వీరికి విముక్తి లభించినట్లే. 

ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? అయితే ఇది తెలుసుకోండి.

సంస్థపై ఆధారపడకుండా సంఘటిత రంగంలోని కార్మికులు తన యూఏఎన్‌ను ఈపీఎ్‌ఫఓ వెబ్‌సైట్‌ నుంచి నేరుగా పొందవచ్చు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ కార్మికులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే పెన్షన్‌ సంబంధిత డాక్యుమెంట్లను డీజీలాకర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది.