Asianet News TeluguAsianet News Telugu

డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ సీజన్ 5 కోసం కొత్త పద్ధతిలో ఆడిషన్స్ ను ప్రకటించిన డిస్కవరీ ఇండియా

డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ సీజన్ 5 కోసం కొత్త పద్ధతిలో ఆడిషన్స్ ను ప్రకటించిన డిస్కవరీ ఇండియా.  క్రిటికల్ థింకింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఆధారితంగా జరిగే దేశంలోనే అతిపెద్ద స్కూల్ క్విజ్… ప్రతి స్కూలు, ఇంటికి విద్య, వినోదాన్ని తీసుకెళ్లడం కోసం హైబ్రిడ్ మోడల్ తో అరంగేట్రం చేయబడుతుంది. 2000+ నగరాల్లోని కోటి మంది విద్యార్థులను చేరుకోవడం దీని లక్ష్యం. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, విద్యలో సృజనాత్మకతను ప్రోత్సహించడంపై సీజన్ 5 దృష్టి పెడుతుంది.

Discovery India has announced a new method of auditions for Discovery School Super League Season 5
Author
First Published Aug 23, 2022, 5:35 PM IST

ముంబై, 23 ఆగస్టు 2022: దేశంలోని ప్రముఖ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ - డిస్కవరీ ఛానల్ ఇండియా, ఆగస్టు 16 నుంచి భారతదేశంలో అతిపెద్దదైన, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న క్విజ్ షోలలో ఒకటైన డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ ఐదవ సీజన్ ప్రారంభమైంది. ఈ జాతీయ స్థాయి పాఠశాల క్విజ్ తాజా సీజన్ గ్రౌండ్ కార్యకలాపాలను ప్రారంభించింది. 'నేర్చుకొని అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని గెలుపొందండి' అనే నినాదంతో సాగే ఈ క్విజ్… కొత్త హైబ్రిడ్ ఫార్మాట్ లో 2000+ నగరాల్లోని కోటి మంది విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుంది.

సీజన్ 4లో డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ అసాధారణ విజయం నేపథ్యంలో, భారతదేశంలోని అతిపెద్ద ఎడ్-టెక్ కంపెనీ, స్కూలు లెర్నింగ్ యాప్ అయిన బైజూస్ భాగస్వామ్యంతో డిస్కవరీ ఛానల్ ఈ క్విజ్ కు ఆతిథ్యం ఇస్తోంది. క్రిటికల్ థింకింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ తో సాగే ఈ క్విజ్… విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీపడటానికి, తమకు, వారి పాఠశాలకు ప్రశంసలు గెలుచుకోవడానికి ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది. ఇది విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడాన్ని మరియు వారికి ఆకర్షణీయమైన రీతిలో జ్ఞానాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 

‘‘డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ అందుకున్న ప్రతిస్పందన స్థాయి నమ్మశక్యం కానిది, చాలా సంతృప్తికరమైనది. పాఠశాలలతోపాటు విద్యార్థులు DSSL కోసం సంవత్సరం పొడవునా వేచి ఉంటారు, ఇది ఒక అద్భుతకృత్యం, ప్రతి సీజన్ లో కొత్త ఆవిష్కరణలతో తిరిగి రావడానికి ఇది మాకు స్ఫూర్తినిస్తుంది. సృజనాత్మకమైన, ఆకర్షణీయమైన ఫార్మాట్ల ద్వారా అందించినట్లయితే అభ్యసన, వినోదం ఏకతాటిపై నడవగలవని డిస్కవరీలోని మేము నమ్ముతున్నాము" అని దక్షిణాసియా- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, యాడ్ సేల్స్ హెడ్ తనాజ్ మెహతా అన్నారు.

పోటీకి సంబంధించి గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభం కావడంతో, విద్యార్థులు తమ స్కూళ్లలో ప్రిలిమినరీ రౌండ్ లో ఉచితంగా పాల్గొనవచ్చు. గెలుపు లేదా ఓటములతో సంబంధం లేకుండా పాల్గొనేవారు అందరూ కూడా బైజూస్ ట్యూషన్ సెంటర్ (BTC) ఉచిత BYJU కోర్సులు, క్లాసులు వంటి పురస్కారాలను అందుకుంటారు.  అదనంగా, ప్రతి గ్రేడ్ టాపర్ కు ఒక స్కూలు బ్యాగ్, బీటీసీలో ముఖాముఖి సంభాషణ ఆప్టిట్యూడ్ టెస్ట్పై సవివర విశ్లేషణను అందుకుంటారు. కఠినమైన క్విజ్ రౌండ్లు దాటుకొని వెళ్లిన తరువాత, స్టేట్ రౌండ్ కోసం అర్హులు ఎంచుకోబడతారు, ఈ రౌండ్లు వారికి దగ్గరల్లో ఉన్న బిటిసిలో జరుగుతాయి.

మొదటి మూడు బృందాలు, వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్ని ఖర్చులతో కూడిన NASA పర్యటనకు వెళ్ళడానికి జీవితకాలంలో ఒకేసారి దక్కే అవకాశం పొందుతారు. అదనంగా, మొదటి మూడు జట్లు డిస్కవరీ నెట్వర్క్ లో కనిపించినందుకు ఉదారమైన నగదు బహుమతి, జాతీయ గుర్తింపును పొందుతాయి.

అభ్యసన, వినోదాలకు ఏకైక గమ్యస్థానంగా ఉన్న డిస్కవరీ ఇండియా. విద్యా చిత్రాలు, క్విజ్లు, ట్రిప్పుల ద్వారా విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి, ప్రత్యేక సర్టిఫికేట్లు, స్కాలర్షిప్లు, అవార్డులు పొందడానికి దోహదపడుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మరియు అభ్యసన స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా, డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ యువ మనస్సుల అభివృద్ధికి దోహదపడేలా విద్యలో ఒక కొత్త దృక్పథాన్ని ప్రభావితం చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios