Dil Jashn Bole : ICC World Cup 2023 అధికార గీతం విడుదల..దుమ్ములేపిన రణవీర్ సింగ్ ..వీడియో మీ కోసం..
ICC ప్రపంచ కప్ 2023కి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నీని చూసేందుకు కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకున్నారు. ఇంతలో, ప్రపంచ కప్ ఈవెంట్ అధికారిక గీతం విడుదల 'దిల్ జష్న్ బోలే' విడుదల అయ్యింది. ఈ అఫీషియల్ యాంథెమ్ గురించి తెలుసుకుందాం.
ICC వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ICC ఈ మెగా ఈవెంట్ కోసం 'దిల్ జష్న్ బోలే' అధికారిక గీతాన్ని విడుదల చేసింది. ఈ గీతాన్ని ప్రముఖ బాలీవుడ్ సంగీతకారుడు ప్రీతమ్ స్వరపరిచారు. ఇందులో నటుడు రణ్‌వీర్‌సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఈ గీతంలో సంగీత దర్శకుడు ప్రీతమ్ , రణవీర్ సింగ్ జోడీ సరదాగా ఆడి పాడారు. ICC భాగస్వామ్యం చేసిన ODI ప్రపంచ కప్ గీతం వీడియోలో, రణవీర్ సింగ్ బ్లూ షర్ట్, మెరూన్ కలర్ బ్లేజర్ మ్యాచింగ్ టోపీని ధరించి కనిపించాడు. వీడియోలో, అభిమానులు మొత్తం 10 దేశాల జెర్సీలు ధరించి కనిపించడం విశేషం.
వీడియో ప్రారంభంలో, రణవీర్ సింగ్‌ను రైలులో చూపించారు, అక్కడ అతను ఒక పిల్లవాడిని, బేటా…నువ్వు ఫ్యాన్ కాదా? దీని తర్వాత పిల్లవాడు ఫ్యాన్ అంటే ఏమిటి అని అడుగుతాడు. దీంతో ఈ పాట ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ మొత్తం రైలులో చిత్రీకరించారు, ఇందులో యుజ్వేంద్ర చాహల్ భార్య ధన శ్రీ కూడా నృత్యం చేస్తూ కనిపించడం విశేషం. రణవీర్ సింగ్, ప్రీతమ్ ఇద్దరూ రైలు పైకప్పుపై నృత్యం చేయడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకుని ప్రజల అభిమానాన్ని చూరగొన్న రణవీర్ సింగ్, ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రీతమ్‌ల సహకారంతో రూపొందించిన ఈ గీతం ఇప్పటి వరకు అభిమానులకు అతిపెద్ద క్రికెట్ ప్రపంచకప్ కాబోతోందని ఐసీసీ తెలిపింది.
ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీ మెగా ఫైనల్ నవంబర్ 19 న జరుగుతుంది. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆసియా కప్ 2023 టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో ప్రపంచకప్‌ను గెలుచుకోవాలని చూస్తోంది.
ICC ప్రపంచ కప్ అధికారిక సాంగ్ ఏ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది?
'దిల్ జష్న్ బోలే అన్ని మేజర్' స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, గానా అందుబాటులో ఉంది. అలాగే హంగామా, రెస్సో, Wynk Amazon, Facebook, Instagram, YouTubeలో కూడా అందుబాటులో ఉంది. అభిమానులు బిగ్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లలో కూడా ఈ గీతాన్ని వినవచ్చు.