న్యూ ఢీల్లీ: యు.కె.లో అనేక సవాళ్లు, కష్టాలు ఎదురైనా తన కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఢీల్లీకి చెందిన యువ బ్యాలెట్ డాన్సర్ పై ప్రశంసలు కురిపిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ లో పోస్ట్ చేశాడు.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  ఆనంద్ మహీంద్రా తన స్నేహితుడి నుండి పొందిన వార్తాపత్రిక క్లిప్ను షేర్ చేస్తూ తన ప్రతిభను మెచ్చుకుంటు ట్వీట్ చేశాడు. వార్తాపత్రిక క్లిప్పింగ్ లో వికాస్‌పురిలోని ఇ-రిక్షా డ్రైవర్ కుమారుడు 20 ఏళ్ల కమల్ సింగ్ గురించి, యు.కే లోని ఒక ఉన్నత బ్యాలెట్ పాఠశాల కోసం తన ఫీజును క్రౌడ్ ఫండ్ చేసిన విధానం గురించి ఉంది.

అతని కోర్సు వ్యవధి ఒక సంవత్సరం, కోర్సు  ఫీజు ధర 8000 పౌండ్లు. ఫీజు కాకుండా ఇందులో అతని వ్యక్తిగత ఖర్చులు, ప్రయాణా ఖర్చులతో సహ ఇతర అదనపు ఖర్చులు కూడా ఉన్నాయి. 17 ఏళ్ళకు బ్యాలెట్ ఏమిటో తనకు తెలియదని చెప్పిన మిస్టర్ సింగ్, కేవలం 14 రోజుల్లో నిధుల సేకరణ వేదిక కెట్టో నుండి 20,000 పౌండ్లను సేకరించాడు.

also read కేవలం ఒక్క ఫోన్ కాల్ తో మీ పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...

"యూ‌.కే లోని ఒక స్నేహితుడు నాకు ఈ క్లిప్పింగ్ పంపాడు, ఢీల్లీ ఇ-రిక్షా డ్రైవర్ కొడుకు యూ‌కేలో అత్యంత ప్రతిష్టాత్మక బ్యాలెట్ పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఇక్కడ గ్లోబల్ లాక్ డౌన్ మధ్యలో, ఒక యువకుడు తన ప్రపంచాన్ని అన్‌లాక్ చేయడాన్ని మనం చూడవచ్చు.

అతని భవిష్యత్తును నేను ప్రశంసిస్తున్నాను," అంటూ 65ఏళ్ల ఆనంద్ మహీంద్రా ఒక మనిషి  అద్భుతమైన ప్రయాణం గురించి ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ కేవలం 30 నిమిషాల్లో 1,200 లైక్ వచ్చాయి. 

మిస్టర్ మహీంద్రా ప్రతిభావంతులైన వ్యక్తుల వివిధ కథలను ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు. కమల్ సింగ్, "ఎబిసిడి: ఎనీబడీ కేన్ డాన్స్"  హిందీ చిత్రం నుండి ప్రేరణ పొంది, కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అతను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా తెలిపాడు.

బ్యాలెట్ డాన్సర్ కమల్ సింగ్ ఒక సంవత్సరం పాటు ఇంగ్లీష్ నేషనల్ బ్యాలెట్ స్కూల్లో శిక్షణ పొందుతున్నట్లు వార్తాపత్రిక పేర్కొంది. అతను త్వరలో ఇంగ్లీష్ నేషనల్ బ్యాలెట్ కంపెనీలో ప్రొఫెషనల్ డాన్సర్‌గా చేరే అవకాశం లభించనుంది.