జొమాటో సీనియర్ మేనేజర్లు మూడేళ్లుగా ఇలా చేస్తున్నారని సంజీవ్ బిఖ్‌చందానీ తెలిపారు. జొమాటో టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ట్విట్టర్ యూజర్లు కూడా మెచ్చుకున్నారు.
జొమాటో వ్యవస్థాపకుడు అండ్ సిఈఓ దీపిందర్ గోయల్ కనీసం 3 నెలలకు ఒకసారి కంపెనీ ట్రేడ్‌మార్క్ రెడ్ టీ-షర్ట్ ధరించి ఆర్డర్‌లు అందజేస్తారని, అయితే ఎవరూ అతనిని గుర్తించలేదని Naukri.com అధినేత సంజీవ్ బిఖ్‌చందానీ ఆదివారం ఒక ట్వీట్‌లో వెల్లడించారు.
"ఇప్పుడే దీపిందర్ గోయల్ అండ్ జొమాటో టీమ్‌ని కలిశాను. దీపిందర్‌తో సహా సీనియర్ మేనేజర్‌లందరూ రెడ్ కలర్ జొమాటో టీ-షర్ట్ ధరించి, బైక్ పై ఎక్కి కనీసం 3 నెలలకి ఒకసారి ఆర్డర్‌లు డెలివరీ చేస్తూ ఒక రోజు గడుపుతున్నారని తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఎవరూ తనని గుర్తించలేదని దీపిందర్ నాకు చెప్పారు'' అని బిఖ్‌చందానీ ట్వీట్ చేశారు.
జొమాటో సీనియర్ మేనేజర్లు మూడేళ్లుగా ఇలా చేస్తున్నారని సంజీవ్ బిఖ్‌చందానీ తెలిపారు. జొమాటో టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ట్విట్టర్ యూజర్లు మెచ్చుకున్నారు."అద్భుతమైన ప్రారంభం, కస్టమర్‌తో సన్నిహితంగా ఉండటం కంటే ఏమీ లేదు" అని రాహుల్ ఉపాధ్యాయ్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
"కస్టమర్‌లు/వ్యాపార భాగస్వాములను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. సాధారణ కస్టమర్‌ల వివిధ రకాల వేషధారణలతో క్యూలలో ఉండటం, ఫ్రంట్‌లైన్ సిబ్బందితో మాట్లాడటం, సమస్యలకు పరిష్కారాలను వెతకడం, అక్కడికక్కడే కస్టమర్ రివ్యూ పొందడం సర్వీస్ సంస్థల కోసం తప్పనిసరిగా చేయాల్సిన పని" అని అరుణ్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
గత వారం కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఇండియా"గ్రాండ్ ఫుడ్ ఫెస్టివల్"గా పేర్కొన Zomaland తిరిగి వస్తున్నట్లు Zomato ప్రకటించింది. "ఇది మా గొప్ప సీజన్, 7 నగరాల్లో కార్నివాల్ టెంట్‌లను ఏర్పాటు చేస్తు బెస్ట్ డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది" అని Zomato సిఈఓ గోయల్ ఒక ట్వీట్‌లో ఫుడ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్నివాల్‌ను ప్రకటిస్తూ హామీ ఇచ్చారు.
Zomato ద్వారా Zomaland ఈ సీజన్‌లో దాదాపు 400 రెస్టారెంట్లు పాల్గొంటాయని భావిస్తున్నారు. మంచి ఫుడ్ తో పాటు, కస్టమర్‌లు మ్యూజికల్ పర్ఫర్మెంస్, ఫన్ గేమ్స్, రికార్డ్ బ్రేకింగ్ ప్రయత్నాలను కూడా ఆశించవచ్చు. ఈ కార్నివాల్ వచ్చే కొన్ని నెలల్లో నిర్వహించే ఏడు నగరాల్లో రెండు రోజుల పాటు ఉంటుంది.
