Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ సింప్లిసిటీ: ఆకలిగా అనిపించి రోడ్డు పక్కన దాబాలో.. ఇంకా రోడ్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం..

మహారాష్ట్రకు చెందిన శాఖాహార వంటకం తేచా అంటే తనకు చాలా ఇష్టమని సూలే చెప్పారు. అతనికి రొయ్యల కూర కూడా చాలా ఇష్టం. మేము ఒకే అలవాట్లను ఉండటం వల్ల  మేము కవలలుగా ఉండేవాళ్లం అని  సుప్రియా సూలే అన్నారు.

Cyrus Mistry Simplicity: fond of road travel and roadside food former bureaucrat remembered this
Author
First Published Sep 6, 2022, 4:58 PM IST

నిన్న ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైరస్ మిస్త్రీ గురించి మాజీ బ్యూరోక్రాట్ గణేష్ జగ్తాప్ మాట్లాడుతూ సైరస్ మిస్త్రీ మరాఠీ ఫుడ్ ఇష్టపడతారని చెప్పాడు. ఇంకా అతను చాలా డౌన్ టు ఎర్త్ అని, వడా పావ్ వంటి రోడ్‌సైడ్ ఫుడ్‌ని ఇష్టపడేవాడని చెప్పాడు.

 రోడ్డు పక్కన దాబా మంచంపై 
టాటా స్టీల్ ప్లాంట్ కారణంగా జంషెడ్‌పూర్‌ను ఐరన్ సిటీగా పిలుస్తారు. 2016లో జంషెడ్‌పూర్‌కు వెళ్లిన సమయంలో అతను వర్క్ నుండి తిరిగు వస్తున్నపుడు అతనికి ఆకలిగా అనిపించి రోడ్డు పక్కన దాబాలో మంచం మీద భోజనం చేయడానికి కూర్చున్నాడు. అక్కడే లంచ్ ఆర్డర్ చేసి తన డ్రైవర్ తో కలిసి మామూలు మనిషిలా తినడం మొదలుపెట్టాడు. ఫోటోగ్రాఫర్ ఫణి మహ్తో ఆ సమయంలో అతనిని చూసి  భోజనం చేస్తున్నప్పుడు అతని ఫోటో తీశాడు. ఈ ఫోటోని 16 మే 2016న ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో తర్వాత టాటా గ్రూప్ చైర్మన్ కూడా ధాబాలో ఇలా తినవచ్చని ప్రపంచానికి తెలిసింది. సైరస్ మిస్త్రీ నిజంగా చాలా సింపుల్. 

 రోడ్డు మార్గంలో ప్రయాణించడం అంటే ఇష్టం
గణేష్ జగ్తాప్ ప్రకారం, సైరస్ మిస్త్రీ ఎప్పుడూ రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. సంస్థలను సందర్శించడానికి వెళ్ళినపుడు ఆయన ఉద్యోగుల ఆరోగ్యం, యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు.  సైరస్ మిస్త్రీ 4 జూలై 1968న ముంబైలో జన్మించారు. ముంబైతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ముంబైతో పాటు అతని ఇళ్ళులు కూడా లండన్, పూణే, అలీబాగ్, మాథేరన్‌లలో ఉన్నాయి, అయితే అతను ముంబైలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అతనికి రేసింగ్‌పై కూడా మక్కువ ఉండేది. ఇందుకోసం పూణెలోని 200 ఎకరాల్లో  ఉన్న మంజరి స్టడ్ ఫామ్‌ను సందర్శించేవారు. ఇది ఇండియాలోని పురాతన స్టడ్ ఫామ్‌లలో ఒకటి. అతను అలీబాగ్, మాథేరన్‌లో కూడా నివసించేవాడు. 

మేం కవలలుగా ఉండేవాళ్లం: సుప్రియా సూలే
సైరస్ మిస్రీ మృతి పట్ల ఎన్సీపీ నేత సుప్రియా సూలే సంతాపం వ్యక్తం చేశారు.  సెప్టెంబర్ 12న నా భర్త సదానంద్, కూతురు రేవతిని లండన్ పంపించాల్సి ఉందని సూలే తెలిపారు. అయితే దీనికి ముందు సైరస్‌ని కలవాలని అనుకున్నాం. మహారాష్ట్రకు చెందిన శాఖాహార వంటకం తేచా అంటే తనకు చాలా ఇష్టమని సూలే చెప్పారు. అతనికి రొయ్యల కూర కూడా చాలా ఇష్టం. మేము ఒకే అలవాట్లను ఉండటం వల్ల  మేము కవలలుగా ఉండేవాళ్లం. ఆహారం తినేటప్పుడు ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. సైరస్‌కి ఉన్న ఈ అలవాటు అతని భార్య రోహికకు నచ్చలేదని, భోజనం చేస్తూ మాట్లాడటం సరికాదని ఎప్పుడూ చెబుతుండేది అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios