Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు.. నేడు హైదరాబాద్ లో లీటరు పెట్రోల్, డీజిల్ ధర తెలుసుకోండి..

మహారాష్ట్రలో పెట్రోల్ ధర రూ.0.66 తగ్గి లీటరుకు రూ.105.96కు చేరగా, డీజిల్ రూ.0.64 తగ్గి రూ.92.49కి చేరుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.0.60 తగ్గి రూ.102.98కి, డీజిల్ ధర రూ.0.59 తగ్గి రూ.95.96కి చేరింది. 

Crude oil prices rise, petrol-diesel prices fall in these states of the country
Author
First Published Nov 12, 2022, 9:15 AM IST

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో నేడు క్రూడాయిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 2.32 (2.48 శాతం) పెరిగి $ 95.99 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు WTI బ్యారెల్‌కు  $2.49 పెరిగి (2.88 శాతం) $88.96 వద్ద ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఇండియాలో పెట్రోల్, డీజిల్  కొత్త ధరలను  విడుదల చేశాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో పెట్రోల్ ధర రూ.0.66 తగ్గి లీటరుకు రూ.105.96కు చేరగా, డీజిల్ రూ.0.64 తగ్గి రూ.92.49కి చేరుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.0.60 తగ్గి రూ.102.98కి, డీజిల్ ధర రూ.0.59 తగ్గి రూ.95.96కి చేరింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలోని 4 మహానగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62 
- ముంబైలో పెట్రోల్  ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63,  డీజిల్  ధర లీటరుకు రూ. 94.24

ఈ నగరాల్లో కొత్త ధరలు 
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.4, డీజిల్ ధర లీటరుకు రూ. 89.92
– ఘజియాబాద్‌లో రూ.96.58, డీజిల్‌ లీటర్ ధర రూ.89.75.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి కొత్త ధరలు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

Follow Us:
Download App:
  • android
  • ios