Asianet News TeluguAsianet News Telugu

Credit Card Mistakes: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ప్రాసెస్‌ చాలా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 

Credit Card Mistakes
Author
Hyderabad, First Published Jan 24, 2022, 1:21 PM IST

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ప్రాసెస్‌ చాలా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఫోన్‌ల ద్వారానే ప్రాసెస్‌ చేసుకుని తక్కువ సమయంలోనే క్రెడిట్‌ కార్డులు అందిస్తున్నాయి బ్యాంకులు. ఇక క్రెడిట్ కార్డు వాడకంలోకూడా అవగాహన కలిగి ఉండటం మంచిది. లేకపోతే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. క్రెడిట్‌ కార్డు తీసుకుని సమయానికి బిల్లులు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడే వారు చాలా మంది ఉన్నారు. కొన్ని తప్పులు చేయడం వల్ల ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయి.

ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా

క్రెడిట్‌కార్డు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు. ఎందుకంటే క్రెడిట్‌ కార్డులో కొంత అమోంట్‌ ఏటీఎం నుంచి డ్రా చేసుకునేందుకు వెలుసుబాటు ఉంటుంది. అలా అని ఎప్పుడు కూడా ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవద్దు. ఇలా చేసినట్లయితే భారీగా ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు డబ్బులు తీసిన దగ్గరి నుంచి వాటిని చెల్లించే వరకు వడ్డీ పడుతూనే వస్తుంది. అందుకే క్రెడిట్‌కార్డు ద్వారా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. క్రెడిట్‌ కార్డులపై కూడా డిస్కౌంట్‌ ఆఫర్లు ఇస్తుంటాయి వివిధ సంస్థలు. ఆఫర్లు ఉన్నాయి కదా అని షాపింగ్‌ చేసి సమయానికి బిల్లు చెల్లించని పక్షంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్‌ కార్డులు వాడేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

కనీస మొత్తాన్ని చెల్లించండి

కార్డ్ హోల్డర్‌లు తమ బకాయి ఉన్న బిల్లులో చిన్న భాగమైన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని మాత్రమే చెల్లించినప్పుడు, లేట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫైన్స్ కూడా ఏమీ ఉండవు. ఇది సాధారణంగా మీరు చెల్లించే మొత్తంలో 5 శాతం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గనుక చెల్లించకపోతే.. అది కాస్తా కుప్పగా మారుతుంది. తుదకు ఫైన్స్ చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని కార్డులకు ఇది 40 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని వినియోగించడం 

చాలా మంది క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ మొత్తాన్ని వాడేస్తుంటారు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయొచ్చు. కానీ, క్రెడిట్ బ్యూరోలు.. దీనిని ఎక్కువగా క్రెడిట్‌పై ఎక్కవగా ఆధారపడటటానికి సంకేతంగా భావిస్తాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఖర్చును మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో 60 శాతం వరకు వినియోగిస్తే సరిపొతుంది. అలా మీకు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

వడ్డీలేని ఈఎంఐలు

క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపులను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే.. వడ్డీ రహిత కాల వ్యవధిని ఎంపిక చేసుకోండి. ఈ కాల వ్యవధి సాధారణంగా 18 నుంచి 55 రోజుల మధ్య వ్యవధి ఉంటుంది. కొనుగోలును బట్టి వ్యవధి పెరుగొచ్చు. ఈ కాలంలో చేసే క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీ ఉండదు. ప్రయోజనాలను ఎక్కువగా పొందడానికి, వడ్డీ రహిత వ్యవధికి అనుగుణంగా మీ కొనుగోళ్లను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Follow Us:
Download App:
  • android
  • ios