Asianet News TeluguAsianet News Telugu

గజగజ వణికిపోతున్న రియాల్టీ రంగం.. మరో రెండు లక్షల కొలువులకు ముప్పు..

కరోనా మహమ్మారి ప్రభావంతో కీలక రంగాలు సైతం అల్లాడిపోతున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధికంగ ఉపాధి కల్పించే రియాల్టీ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటికే 60 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, మున్ముందు మొత్తం రెండు లక్షల మంది ఇళ్లకు పరిమితం కావాల్సి వస్తుందని ఓ సర్వేలో తేలింది.
 

Corona Effect: 2 Lakh Jobs will loss in Reality Sector
Author
Hyderabad, First Published Jun 29, 2020, 10:23 AM IST

ముంబై: కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో రియాల్టీ రంగం గజగజ వణికి పోతోంది. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ ఆగిపోయాయి. పూర్తయిన ప్రాజెక్టుల అమ్మకాలు అడుగంటాయి. దీంతో కంపెనీల లాభాలకూ గండి పడింది.

ఈ దెబ్బతో చాలా బిల్డర్లు ప్రాజెక్టుల కోసం తెచ్చిన రుణాలు చెల్లించలేక చేతులు ఎత్తేశారు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు చాలా రియాల్టీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధమయ్యాయి.

కొన్ని కంపెనీలు ఇప్పటికే 60వేల మందికిపైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. పరిస్థితులు మెరుగుపడకపోతే వచ్చే 3 నెలల్లో మరో 30,000 మంది వైట్‌ కాలర్‌ ఉద్యోగులూ రోడ్డున పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మీద రియాల్టీ రంగంలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని మైహైరింగ్‌క్లబ్‌.కామ్‌, సర్కారీ నౌకరీ.ఇన్‌ఫో పోర్టల్స్‌ అంచనా వేస్తున్నాయి. 

also read రంగంలోకి ఐఆర్డీఏఐ: కరోనా రోగులకూ బీమా.. జూలై 10 నాటికి రెడీ ...

అన్ని రంగాల్లో మాదిరిగానే రియాల్టీ రంగంలోనూ ప్రస్తుతం ఉద్యోగుల తీసివేతతోపాటు ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో 15 నుంచి 20 శాతం వరకు కోత పెట్టాయి. పెద్ద పెద్ద రియాల్టీ కంపెనీల ఉద్యోగులకూ ఈ కోతల బాధ తప్పడం లేదు. కొన్ని కంపెనీలైతే కొంత మంది ఉద్యోగుల్ని జీతాల్లేకుండా సెలవుపై పంపాయి. 

లాక్‌డౌన్‌తో అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో గత మూడు నెలల్లో నివాస గృహాల అమ్మకాలపై వచ్చే ఆదాయం 26.58 శాతం పడిపోయింది. జూలైలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బిల్డర్లు 35.07 శాతం ఆదాయం కోల్పోతారని అంచనా. 

వాస్తవానికి 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు కొద్దిగా పుంజుకుంటాయని పరిశ్రమ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే కరోనా దెబ్బతో నాలుగో త్రైమాసికంలో అమ్మకాలు పూర్తిగా అడుగంటడంతో 2019-20లో నివాస గృహాల ఇళ్ల అమ్మకాలు మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios