Asianet News TeluguAsianet News Telugu

7 వేల ఉద్యోగులపై కాగ్నిజెంట్‌ వేటు...

పడిపోతున్న వ్యాపారం, పెరుగుతున్న నష్టాలు, సంస్థా వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం వివిధ విభాగాల్లో ఉద్యోగులను తీసేసేందుకు సిద్ధమవుతున్నాయి. మొతానికి 7 వేల ఉద్యోగులపై కాగ్నిజెంట్‌ వేటు వేయనుంది. 
 

congnizant going to remove 7 thousand of employees soon
Author
Hyderabad, First Published Oct 31, 2019, 3:57 PM IST

బెంగళూరు: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ ​కాగ్నిజెంట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. పడిపోతున్న వ్యాపారం, పెరుగుతున్న నష్టాలు, సంస్థా వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం వివిధ విభాగాల్లో ఉద్యోగులను తీసేసేందుకు సిద్ధమవుతున్నాయి.

అలాగే క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడులు పెట్టడంతో సహా, కొన్ని వ్యూహాత్మక పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింత మంది ఉద్యోగులను తగ్గించుకోనుంది. కొత్త నియామకాలు, జీతాల పెంపు, పదోన్నతులను నిలిపి వేయడమేగాక, అదనపు ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఇప్పటికే  2017లో 3 లక్షలకు పైగ టెలికం ఉద్యోగులు ఇప్పుడు మాత్రం 2.30 లక్షలకు పడిపోయారు.

also read సౌదీలోనూ చకచకా దూసుకెళ్తున్న మన ‘రూపే’కార్డు...

 న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో  విశ్లేషకులతో పోస్ట్-ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 10,000-12,000 మధ్య సీనియర్ ఉద్యోగులను వారి ప్రస్తుత పాత్రల నుండి తొలగించనున్నామని వెల్లడించారు. ఇది  కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతమని కంపెనీ అధికారులు తెలిపారు.

congnizant going to remove 7 thousand of employees soon

మరోవైపు పరిశ్రమ రుణ భారం రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో 16 వేలకుపైగా ఉద్యోగులుండగా, జియోలో 15 వేలకుపైగా ఉద్యోగులున్నారు. వొడాఫోన్ ఐడియాలో దాదాపు 10 వేల ఉద్యోగులున్నారు. ఇక ప్రభుత్వ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ (వీఆర్‌ఎస్) ఆఫర్లను ఇస్తున్న విషయం తెలిసిందే.

also read 300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

బీఎస్‌ఎన్‌ఎల్‌లో దాదాపు 1.68 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌లో సుమారు 22 వేల మంది ఉద్యోగులున్నారు. జియో రాకతో ఒకప్పుడు దాదాపు 15 సంస్థల వరకున్న టెలికం కంపెనీలు.. ప్రస్తుతం నాలుగింటికి పడిపోయిన సంగతీ విదితమే. విలీనాలతోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బు​క్‌కు కంటెంట్‌ రివ్యూ కాంట్రాక్టర్‌గా ఉన్న కాగ్నిజెంట్ తన కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమిస్తున్నట్టు  ప్రకటించింది. ఈ చర్య సంస్థ  కొత్త వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందనీ, అయితే  కంటెంట్ మోడరేషన్ నుండి పూర్తిగా నిష్క్రమించలేదని సంస్థ ప్రతినిధి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios